సాక్షి డిజిటల్ న్యూస్: ఏపీలోని ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు బంపరాఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చొరవతో అక్వాఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింది. మరోవైపు ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని, 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆక్వాఫీడ్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు చొరవచూపారు. ఆక్వాఫీడ్ తయారీదారులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులు, ఆక్వారా రైతులు, ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు, ఆక్వా సాగుకు విద్యుత్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు తయారీ దారులు అంగీకరించారు.కేజీకి ప్రస్తుతమున్న రూ.112 నుంచి రూ.108కి ఫీడ్ ధరలను తగ్గించనున్నట్లు తయారీదారులు సీఎంకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో చేపలు, రొయ్యల సాగు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆక్వాసాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలు ఆక్వా ఫీడ్ ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులతో కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 20 రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆక్వాసాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వాసాగును శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అంటూ రైతులు అభిప్రాయపడ్డారు. ఆక్వారంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెంచారని…అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆక్వా రైతులు తెలిపారు. ఆక్వా రైతులు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని…ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయం చేశారని ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. 2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.107.80కి చేరిందని రైతులు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర రూ.5.80 తగ్గించిందని రైతులు తెలిపారు. రైతులు ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని మరింత లాభాలు సాధించేలా చూడాలనీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వారంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్: మంత్రి అచ్చెన్నాయుడు అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపినా, రైతులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారని మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించలేదని, రైతులు, కంపెనీల మధ్య సమన్వయం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర అంగీకారంతో పరిమిత స్థాయిలో ధరల సవరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫీడ్ ధర కేజీకి ఇప్పుడున్న ఎంఆర్పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుంది. ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని, 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని, అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లలో వర్జినీయా పొగాకు ఉత్పత్తి పెరగడం, ఎగుమతి పరిస్థితులు మారడం వల్ల ధరలు ప్రభావితమైనప్పటికీ రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పొగాకు వేలం కేంద్రాల్లో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలని, పొగాకు బోర్డు పరిధిలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రైతులు తీసుకొచ్చిన పొగాకును తిరస్కరించే పరిస్థితి ఉండకూడదని, మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం ఆదేశించారని, పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. వేలం కేంద్రాల వెలుపల జరిగే అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు విస్తీర్ణంపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అందించే చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.