రెండేళ్లలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తా

అక్షర ఆయుధం ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దశాబ్దకాలం పాటు ఎదురు చూశాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోంది. రాయలసీమ అంటే ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, సీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్- రాయల్ ఎన్ ఫీల్డ్. కియా కార్లు, హీరో బైక్ , డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ. ఇకపై ఈ ప్రాంతం ఏమాత్రం కరువు నేల కాదు. జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లలపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ‘అనంతరం జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.‘1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల ద్వారా పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు జిందాల్ సంస్థ పెట్టుబడి పెట్టనుంది. రూ.20,350 కోట్ల పెట్టుబడులతో 3,850 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కాకున్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సోలార్ & విండ్ ద్వారా 3,850 మెగా వాట్లను జిందాల్ ఎనర్జీ సంస్థ ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 2,700 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనుంది. స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమలో నవశకం మెుదలైంది‘పరిశ్రమలు, రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఓ నవశకం మొదలైంది. విభజన తర్వాత అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. రాయలసీమ ప్రజలందరికీ మరొక్కమారు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారు. 2019లో ఓసారి, 2023లో మరోమారు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. గడచిన రెండేళ్లలో చాలా అంశాల్ని పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం.1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుంది. మొదటి దశలో రూ.4 వేల కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాయలసీమ ఉక్కు ప్రాంతంగా మారుతోంది ‘ఉక్కు రాష్ట్రం ఏపీ, విశాఖతో పాటు రాయలసీమగా ఉక్కు ప్రాంతంగా తయారవుతుంది. స్టీల్ ప్లాంట్ తో పాటు సోలార్ ఎనర్జీ క్యాప్టివ్ ప్లాంట్‌ను జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేస్తోంది. పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో వ్యర్ధాల నుంచి వచ్చిన ఇనుము సేకరించి ఉక్కు ఉత్పత్తి చేస్తారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి రూ.11,440 కోట్ల ఆర్ధిక సాయం తెచ్చి కాపాడాం. నక్కపల్లిలోనూ ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. జేఎస్ డబ్ల్యూ కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారు. రాయలసీమ ప్లాంట్ బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్ధ్యంతో పనిచేయాలని జేఎస్ డబ్ల్యూను కోరుతున్నాను. గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీల నీటిని కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు అందిస్తాం.రాయలసీమ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా సరఫరా చేసేందుకు ఏపీ సిద్ధం. రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు ఏర్పాటు చేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఓబులాపురం గనుల పేరుతో భారీ దోపిడీ‘రాయలసీమకు ఎవరివల్ల నష్టం జరిగిందో ప్రజలు గమనించాలని కోరుతున్నాను. జేఎస్ డబ్ల్యూ ప్లాంట్‌తో ఈ ప్రాంతంలో సామాజికంగా ఆర్ధికంగా ప్రభావం ఉంటుంది. గతంలో కియా ప్లాంట్ తీసుకువచ్చాను. అన్ని దేశాలకు ఆ సంస్థ కార్లను ఎగుమతి చేస్తోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘కియా కార్ల పరిశ్రమతో అనంతపురం దశాదిశ మారింది. కొందరు స్వార్థపరులు గతంలో కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేసి అక్రమాలు చేశారు. 2007లో 14 వేల ఎకరాలను బ్రహ్మణీ స్టీల్స్‌కు భూములు ఇచ్చి భ్రమలు కల్పించారు. ఎయిర్ పోర్టు కడతామని అన్నారు. ఇప్పటి వరకూ అదీ జరగలేదు. ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు. స్మగ్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. దేశానికి ఉపయోగపడాల్సిన సంపద విదేశాలకు తరలిపోయింది. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లారు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.రాయలసీమకు చెందిన సంపద ఈ ప్రాంతంలోనే ఉపయోగపడాలి‘రాయలసీమకు చెందిన సంపద ఈ ప్రాంతంలోనే ఉపయోగపడాలి. ఇక్కడి ముడి ఇనుముతో ఇక్కడే ఉక్కు తయారు అవ్వాలి. ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంట్లతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడతాం. రూ.11 లక్షల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రాష్ట్రానికి చెందిన యువత మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉ1ద్యోగాలు కల్పిస్తాం. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కడప జిల్లాకు, రాయలసీమకు ఏమీ చేయలేదు. రెండేళ్లలో జేఎస్‌డబ్ల్యూను ఒప్పించి, అనుమతులు తెప్పించి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. వచ్చే రెండేళ్లలోనే ఈ పరిశ్రమలో ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రెండేళ్ల తర్వాత ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తా‘రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే సమయానికి వచ్చి ఈ ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తాం. గత పాలకులు రాయలసీమలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేక పోయారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే ఇస్తాం. సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులలో చీని తోటలు కూడా బ్రతికించాం, ఎర్రబెల్లి చెరువుకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాం. సీమలో స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్సు, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తాయి. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసే స్పేస్ సిటీలో, డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్ డబ్ల్యూ ముందుకు వచ్చింది. హార్టికల్చర్ కారణంగా ఇక్కడి లింగాల మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉంది. ఆగస్టు 15 నాటికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు మదనపల్లిలో శంకుస్థాపన చేస్తాం. ప్రభుత్వం తరపున రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు‘అమెరికాలో ఉన్న గ్రాండ్ కాన్యాన్‌కు ధీటుగా మన గండికోటను అభివృద్ధి చేస్తాం. హార్టికల్చర్ పంటలతో భూములకు మరింత విలువ పెరుగుతుంది. మన పల్లెలు సంపదకు కేంద్రం అవుతాయి.విధ్వంసమే గొడ్డలి పార్టీకి అజెండా. వారికి విశ్వసనీయతే లేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘నిన్న మావిగన్ అన్నారు. నేడు విజయవాడ అంటున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని చెబుతున్నాను. గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి. మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్రంగా నష్ట పరిచారు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘ప్రజలంతా గర్వపడే విధంగా కాలరెత్తుకుని చెప్పే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. హింస, నేరాలతో రాజకీయాలు చేయకూడదు. ప్రజల కోసం బాధ్యతగా చేయాలి. విజయవాడ యువకుడి అదృశ్యం ఘటనను కూడా రాజకీయం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. పోలీసులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తారు. ప్రజల శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. గంజాయి బ్యాచ్ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించాను. మా హయాంలో శాంతిభద్రతలకే పెద్ద పీట వేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *