తెలంగాణలో తీవ్ర విషాదం

అక్షర ఆయుధం : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో విషాద ఘటన జరిగింది.వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పాపయ్య పేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు గురువారం రాత్రి రైలు కిందపడి చనిపోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ దంపతులకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడ్డారు.రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడటంపై స్థానికులు విలపిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో ఏం జరిగిందో ఎవరికీ తెలియదని అంటున్నారు. ఇకపోతే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు కిందపడి దంపతులు మృతి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా చెన్నారావు పేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు. వీరు ప్రస్తుతం హయత్ నగర్‌ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే గురువారం రాత్రి ఈ దంపతులు రవికుమార్, శిరీషలు ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘట్ కేసర్-బీబీ నగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్‌సీ సమీపంలో రైలు కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏ సమస్యకు కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లు, ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆలోచనలువస్తే… దయచేసి వెంటనే సహాయం తీసుకోండి. మీ ప్రాంతంలోని మానసిక ఆరోగ్య నిపుణుడిని, కౌన్సెలర్‌ను లేదా సపోర్ట్ హాట్‌లైన్‌ను సంప్రదించండి. మీరు ఒంటరి కాదు. సహాయం మీకు అందుబాటులో ఉంది. అటువంటి ఆలోచనల నుంచి బయటపడేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు..వన్‌లైఫ్‌ ఎన్జీఓ: 7893078930, భూమిక- 1800 425 2908, రోష్ని- 8142020033, 040-66202000లలో సంప్రదించండి. బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆధ్వర్యంలోప్రత్యేకంగా ఆత్మహత్యల నివారణకు హెల్ప్‌లైన్‌ – 9493238208 అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *