రాయలసీమలో భారీ బంగారం నిల్వలు.. 50 టన్నుల గోల్డ్ ఆనవాళ్లు!

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో నెలకొన్న బంగారం కరువును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చనుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ బంగారం గనుల తవ్వకానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. జొన్నగిరితోపాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా బంగారం నిల్వలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. దేశంలో బంగారం డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ బంగారు గనితో ఆ లోటు తీరే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అరుదైన రికార్డు నమోదు చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే బంగారం ఉత్పత్తిలో కీలక కేంద్రంగా మారనుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించింది ప్రభుత్వం.వందలు కాదు ఏకంగా వేల కిలోల బంగారం గనులను ప్రభుత్వం గుర్తించింది. ఈ బంగారు గనుల తవ్వకం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా జొన్నగిరి నిలవనుంది. ఇప్పటివరకు భారతదేశం గోల్డ్ అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బంగారు గని వెలుగులోకి రావడం…స్థానిక వనరులు వినియోగంలోకి వస్తే దేశ గనుల రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

జొన్నగిరి గ్రామంలో 50 టన్నుల బంగారం

రాయలసీమ ఇకపై బంగారు గనుల సీమగా మారిపోనుంది. వేల కిలోల బంగారం గనులు రాయలసీమలో బయటపడింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈ బంగారు గని ప్రాంతం బయటపడింది. రాబోయే 15 ఏళ్లపాటు ప్రతీ ఏడాది వెయ్యి కిలోల శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌’ను చేపట్ట నుంది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నారు.జొన్నగిరి గ్రామంలో దాదాపు 50 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు గనులు, భూగర్భశాస్త్ర శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అంచనా వేస్తున్నారు.జొన్నగిరితో పాటు రామగిరి, జవ్వకుల, చిగురుకుంట-బిస్నాటం ప్రాంతాలు కూడా బంగారం తవ్వకాలకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఇంకా వినియోగంలోకి రాని ఖనిజ బ్లాకులను గుర్తించి లీజుకు ఇవ్వనుంది.

800 టన్నుల బంగారం డిమాండ్

భారతదేశంలో దేశీయ బంగారం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కర్ణాటకలోని ప్రఖ్యాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2000లో క్లోజ్ అయిపోయింది.అనంతరం హట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మిగిలింది. అయితే ఈ హట్టి గోల్డ్ మైన్స్ కేవలం ఏడాదికి 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 800 టన్నులకుపైగా బంగారం వినియోగిస్తోంది. భారత్‌లో ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావడంతో మిగిలిన బంగారం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుతో ఈ లోటును తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టన్ను రాతిని ప్రాసెస్ చేస్తే 1 గ్రాము బంగారం లభ్యం

ప్రస్తుతం బంగారం తవ్వకాల్లో అధిక పెట్టుబడితోపాటు సాంకేతిక నైపుణ్యంఅత్యవసరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన పోటీ బిడ్డింగ్ విధానం ద్వారా తవ్వక హక్కులు ఇస్తోంది. ప్రస్తుతం తక్కువ స్థాయి ధాతువు నుంచే బంగారం తీసుకోవాల్సి వస్తోంది కాబట్టి ప్రైవేట్ రంగ భాగస్వామ్యం చాలా కీలకంగా మారనుంది. ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించి ఒక టన్ను రాతిని ప్రాసెస్ చేస్తే సుమారు 1 గ్రాము బంగారం మాత్రమే లభిస్తోంది. గతంలో ఇదే పరిమాణం రాతి నుంచి 3 గ్రాముల బంగారం వచ్చేది. 0.8 గ్రాముల కంటే తక్కువ వస్తే ఆ తవ్వకం లాభదాయకం కాదు. క్రషింగ్, కార్బన్ ఇన్ లీచ్ ప్రాసెసింగ్, ఆధునిక స్మెల్టింగ్ ఫర్నేసెస్ ఉపయోగించి జొన్నగిరి ప్లాంట్‌లో రాతి నుంచి అధిక శుద్ధి ఉన్న డోరీ బార్లు తయారు చేస్తున్నారు.అనంతరం రామగిరి, జవ్వాకుల, చిగురుకుంట-బిస్నాతం వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలను గుర్తించడంతో అక్కడ కూడా తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *