కులం దరిద్రం వదిలితే తప్ప ఏపీ బాగుపడదు.

నేరస్థులు పాలకులుగా మారితే ప్రమాదం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జనం న్యూస్ : కొందరు నేరస్తులకు కులం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన కులం దరిద్రం వదిలితే తప్ప రాష్ట్రం బాగుపడదు. క్రిమినల్‌కు కులం ఉండదు. అత్యాచారం చేసేవాడికి, దోపిడీ చేసే నీచుడికి కులం ఎందుకు ఉంటుంది? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.సుగాలి ప్రీతి, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో గత ప్రభుత్వం సాక్ష్యాలను నాశనం చేయడం వల్లే నేరస్తులకు శిక్ష పడటం కష్టమవుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ‘సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి. వారికి కులాలను అంటగట్టడం సరికాదు. ⁠ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే కులాల దరిద్రం వదిలిపోవాలి.⁠నేరం చేసిన వాళ్ళకి కులం ఏమిటి?’అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. కుల దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కులాలు దాటి దేశం కోసం వెళ్దామనుకుంటే నన్ను కులచట్రంలోకి తీసుకొస్తున్నారు. వ్యవస్థలు బాగుండాలని కోరుకునే నన్ను కుల వ్యవస్థలో బంధిస్తున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు.చేతులెత్తి దండం పెడుతున్నాను కులాలకు నన్ను పరిమితం చేయోద్దు. నా కులంలోని ఎవడో నేరస్థుడు రేప్ చేస్తే దానికి నేను బాధ్యత వహించాలా ఎవడో రౌడీ చస్తే నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేరాలు చేసేవారిని కుల కోణం నుండి చూడకండి, కులపరంగా సమర్థించకండి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు ‘నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు. క్రిమినల్స్ పాలకులైతే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది. ⁠ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి. అతను డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎవరికీ కులం గుర్తుకురాదు. ఇప్పుడు నేరస్థులపై చర్యలు తీసుకుంటుంటే మాత్రం గుర్తొస్తుంది’అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘⁠రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిచ్చివేషాలు వేస్తే క్షమించం ‘కూటమి పాలనలో ఎవరైనా తప్పు చేసి దొరికితే, వారు తమ జీవితంలో మళ్లీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచన కూడా చేయలేనంత తీవ్రంగా చర్యలు ఉంటాయి. తప్పు చేసే వాడికే కులం ఉంటుందా బాధితురాలుకి కులం ఉండదా?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘⁠పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు. పాపం పసి వయసులో బీరు బాటిల్ తీసుకుని గొంతు కోసేశాడు. తెలిసి తెలియని పసి వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. ⁠ఇదే పెద్దమనిషి తెలంగాణ ప్రభుత్వం దిశ కేసులో చేస్తే అద్భుతంగా చేశారని అంటారు. ఏపీకి వచ్చేసరికి కులం పేరు ఎత్తుతాడు. వైసీపీ రౌడీ మూకలకి చెబుతున్నా పిచ్చి వేషాలు వేస్తే క్షమించే పరిస్థితి ఇక్కడ లేదు. పొరపాటున మీ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కి నారతీస్తా’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *