విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆరోపణలు

తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం

సాక్షి డిజిటల్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. టీవీకే ఎమ్మెల్యేనే స్వయంగా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. దీంతో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… టీవీకేకు చెందిన చెందిన ఇళయరాజా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం జరిగిందని ఆ ఫిర్యాదులో ఇళయరాజా ఆరోపించారు. కొందరు వ్యక్తులు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంప్రదించి, పార్టీ మారాలని ఒత్తిడి చేశారని… ఇందుకోసం రూ. 35 కోట్ల నగదు ఆశ చూపారని ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌పై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంకు అనుకూలంగా ఓటు వేసేందుకు ఈ డబ్బులు ఆశగా చూపారని కూడా ఆరోపించారు. ఇక, అధికార పార్టీని చీల్చి, సీఎం పదవిలో నుంచి జోసెఫ్ విజయ్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రయత్నంలో భాగంగానే తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం జరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఇక, టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ… డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము చాలా కాలంగా ఇదే చెబుతున్నామని తెలిపారు. ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆదేశాల మేరకు… సెంథిల్ బాలాజీ వంటి డీఎంకే నేతలు తమ టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు రూ. 10 కోట్లు, రూ. 20 కోట్లు, రూ. 50 కోట్లు వరకు ఆశ చూపుతున్నారని అన్నారు. గత 40 రోజులుగా ఇది జరుగుతుందని కూడా ఆరోపించారు. టీవీకే నేతల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి నరేష్, తిరునావుక్కరసు, త్యాగరాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్‌తో సహా ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు తాము వ్యవహరించినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివరాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.సంబంధించి టీవీకే నేత పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… మరోవైపు ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు ధృవీకరించారు. అయితే ఈ కేసులో నింఅయితే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ మారేలా చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్న టీవీకే నేతలు… దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.దితులను ప్రస్తుతం విచారిస్తున్నామని చెప్పారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *