జనం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సదస్సును నిర్వహించింది. ఈ వేదికపై నుందచి తెలంగాణలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… రైతు భరోసా పథకం నిధుల విడుదలలో భాగంగా తొలి విడత కింద రెండెకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ వేదికగా మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… రైతు భరోసా కింద మొత్తం రూ. 9 వేల కోట్లను 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలిపారు. ఎవరు ఎంత ఏడ్చినా, రైతు సంక్షేమం ఆగదని చెప్పారు. ఇక, వానాకాలం పంటలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ. 9 వేల కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే రైతు భరోసా తొలి విడత కింద రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే రైతులు తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…. > రైతు భరోసా నిధులు బ్యాంక్ అకౌంట్‌లో జమ అయినట్టుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అందుకే మీ ఫోన్‌కు ఏమైనా మెసేజ్‌లు వచ్చాయో? లేదో? చెక్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల మొబైల్ నంబర్లకు మెసేజ్ పంపుతుంది. >> మీ ఏటీఎం కార్డును ఉపయోగించి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్లి మినీ స్టేట్‌మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రింట్ అవుట్ బయటకు వస్తుంది. దాంతోపాటు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. తద్వారా రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో ఈ మార్గం ద్వారా తెలుసుకోవచ్చు. >> బ్యాంక్‌కు వెళ్లి పాస్‌బుక్ చూపించడం ద్వారా కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు., >> ఇక యూపీఐ యాప్స్ ఉపయోగించి కూడా మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో పరిశీలించుకోవచ్చు. మీ అకౌంట్లో డబ్బు పడినట్లయితే మీ బ్యాలెన్స్ పెరుగుతుంది. అందుకే ముందు మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకుంటే, ఆ తర్వాత డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకునే అవకాశం ఉంటుంది.