"హరీశ్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది".. మంత్రి పొంగులేటి ఘాటు ఆరోపణ

పయనించే సూర్యుడు న్యూస్ : మాజీమంత్రి హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లు ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయ‌కులు చేసే చిల్ల‌ర విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిసారీ స్పందించను. ఎప్పుడో ఒక‌సారి ఖ‌చ్చితంగా క‌ర్ర కాల్చి వాత పెడ‌తా. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలిన‌ట్టుకాదు. ప్ర‌జ‌లు ఛీ కొట్టినా బాంబులు ప‌డ్డ‌ట్టే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హ‌రీశ్‌‌రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయ‌న‌కు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింద‌నే అనుమానం క‌లుగుతోంద‌ని ధ్వజమెత్తారు.సోమ‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి మాట్లాడుతూ ద‌మ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న‌ హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డారు. తెలంగాణ ప్ర‌జానీకం మాకు ఐదేళ్ల‌కు అధికార‌మిచ్చారు. రెండున్న‌రేళ్ల‌కే ఎందుకు అసెంబ్లీని ర‌ద్దు చేస్తాం. ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. గ‌డ‌చిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల తీర్పు ఏవిధంగా ఉందో హ‌రీశ్‌రావుకు తెలుసు.ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే తీర్పు ఏముంది? రెండుకాళ్లు లేనివాడు చూసుకుందాం రా… అని స‌వాలు విసిరిన‌ట్లే బిఆర్ఎస్ నాయ‌కుల స‌వాళ్లు ఉంటున్నాయి’అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చెప్పుకొచ్చారు.

చిల్ల‌ర విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిసారీ స్పందించను

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసే మంచిప‌నుల‌ను జీర్ణించుకోలేక భ‌విష్య‌త్తులో అధికారం ద‌క్క‌ద‌నే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నారు అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఆరోపించారు. నా నియోజ‌క‌వ‌ర్గం పాలేరులో కేటీఆర్ విమ‌ర్శ‌లు ఇదే కోవ‌లోకి వ‌స్తాయి.బీఆర్ఎస్ నాయ‌కులు చేసే చిల్ల‌ర విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిసారీ స్పందించను. ఎప్పుడో ఒక‌సారి ఖ‌చ్చితంగా క‌ర్ర కాల్చి వాత పెడ‌తా. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలిన‌ట్టుకాదు. ప్ర‌జ‌లు ఛీ కొట్టినా బాంబులు ప‌డ్డ‌ట్టే. ఏ వ్య‌క్తి మీదా వ్య‌క్తిగ‌త క‌క్ష‌పూరిత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఆలోచ‌న ఈ ప్ర‌భుత్వానికి లేదు. త‌ప్పుచేసిన వాళ్ళ‌ను జైలులో వేస్తేనే శిక్షించిన‌ట్లు కాదు. ప్ర‌తి ఎన్నిక‌ల్లో వాళ్ల‌ను ఓడించి ప్ర‌జ‌లు శిక్షిస్తూనే ఉన్నారు. త‌మిళ‌నాడు లాంటి ప‌రిస్ధితి ఈ రాష్ట్రంలో తీసుకురాం’అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్పష్టం చేశారు.

బిజేపీ, బిఆర్ఎస్ ఒకే తాను ముక్కలు

‘అధికారంలోకి వ‌స్తామ‌ని బిజేపీ ప‌గ‌టిక‌ల‌లు కంటోంది. ఆశ ఉండ‌డంలో త‌ప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశ‌కు పోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ ప‌డుతోంది’ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అని అన్నారు. ‘బిజేపీ, బిఆర్ఎస్ ఒకే తాను ముక్కలు. కాళేశ్వ‌రం అవినీతి, ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ అక్ర‌మాల‌పై సిబిఐ విచార‌ణ చేయాల‌ని అడిగితే బిజేపీ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. ఈ సారి రైతు భ‌రోసా నిధుల‌ను అనుకున్న‌దానికంటే రెండు మూడు రోజుల ముందే వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో జ‌మ‌చేస్తాం. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల కోసం ఇప్ప‌టివ‌ర‌కు 18 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 23 స్ధ‌లాల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేసే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేదు. భూముల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌లు ఎక్క‌డైనా పొర‌పాటుగా ఎక్కువ ధ‌ర నిర్ణ‌యిస్తే స‌రిచేయ‌డానికి సిద్దంగా ఉన్నాం. తాండూరులో ఇదే విధంగా జ‌రిగితే స‌రిదిద్ద‌డం జ‌రిగింది’అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *