బంగారం కొనుగోళ్ల తగ్గింపు, పెట్రోల్ – డీజిల్ ఆదా.

* దేశ ప్రజలకు ప్రధాని మోదీ థాంక్స్

జనం న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలను ప్రస్తావిస్తారనే సంగతి తెలిసిందే. తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో మోదీ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలను ప్రస్తావిస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కీలక అంశాలపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితిని ప్రస్తావిస్తూ… భారత ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఇదివరకు తాను చేసిన విజ్ఞప్తి ప్రజల్లో ఎలాంటి ప్రభావంపై చూపిందనే దాని గురించి కూడా ఆయన వివరించారు. దేశ ప్రజలను తన విజ్ఞప్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా… అందుకు సహకరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్,అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు మోదీ కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని… ఏడాది పాటు బంగారం కొనవద్దని… కార్‌పూలింగ్ చేయాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. రైతులు సహజమైన, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కూడా ఆయన కోరారు. అయితే తాను చేసిన ఈ విజ్ఞప్తి ప్రభావం గురించి ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చర్చించారు. ‘‘నా విజ్ఞప్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా… అందుకు సహకరిస్తున్న దేశంలోని ప్రతి పౌరుడికి నేను కృతజ్ఞుడను. చాలామంది కార్‌పూలింగ్ అనుభవాలను కూడా పంచుకున్నారు. ఒకప్పుడు వేర్వేరు మార్గాల ద్వారా ఒకే వైపునకు ప్రయాణించే ప్రజలు ఇప్పుడు కలిసి ప్రయాణిస్తున్నారు. భారతీయులందరం ఈ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రజా భాగస్వామ్యం అనే ఈ శక్తి మనల్ని బలోపేతం చేసి, విజయం సాధించేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘సాధ్యమైనంత వరకు ప్రజలు కొంతకాలం పాటు బంగారం కొనడం మానుకోవాలని నేను సలహా ఇచ్చాను . విదేశీ విహారయాత్రలకు వెళ్లవద్దని ప్రజలను కోరాను. కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశాను. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాలను కాపాడుకోవాలని, వీలైనంత వరకు సహజ ఎరువులను ఉపయోగించాలని నేను కోరాను… చాలా కుటుంబాలు తమ అనుభవాలను పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి కుటుంబ వివాహాలకు బంగారం కొనకూడదని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే, వారు పాత బంగారంతో కొత్త ఆభరణాలు తయారు చేయించుకుంటారు…’’ అని ప్రధాని మోదీ వివరంగా చెప్పారు. చాలా మంది పౌరులు తమ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని కూడా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కార్‌పూలింగ్‌పై అవగాహన కూడా పెరిగిందని అన్నారు. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ట్రాఫిక్, కాలుష్యం కూడా తగ్గుతున్నాయని చెప్పారు. ప్రజలు ఇప్పుడు బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా సౌకర్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని… ఇది ఒక సానుకూల మార్పుకు సంకేతమని మోదీ అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో సహజ వ్యవసాయానికి, సేంద్రియ ఎరువులకు డిమాండ్ పెరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *