తెలంగాణ ప్రభుత్వ స్కూల్ టీచర్లు, సిబ్బందికి భారీ ఊరట..

* విద్యార్థులతోపాటే ఈ ప్రయోజనం!

జనం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో కేవలం విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం, సీఎం అల్పాహార పథకం అమలు అవుతుంది. అయితే ఇకపై ఈ పథకాన్ని విద్యార్థులతోపాటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి కూడా ఈ ఉచిత భోజనం, సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం వర్తింపజేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో పని చేసే ఉపాధ్యాయులకు,ఇతర సిబ్బందికీ తీపికబురు చెప్పింది. ఇకపై అల్పాహారం, మధ్యాహ్నాం భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విద్యార్థులకు ఈ పథకం అమల్లోకి ఉండగా తాజాగా ఉపాధ్యాయులకు వర్తింపజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తొలి ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అందరికీ ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.దీనికి సంబంధించి విధి విధానాలు, ఇతర అంశాలు అధికారికంగా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఇకపై టీచర్లకు ఉచిత భోజనం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో కేవలం విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం, కొన్నిచోట్ల సీఎం అల్పాహార పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు రోజంతా విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి కూడా ఈ ఉచిత భోజనం, సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో విద్యాసంస్థల్లో నాణ్యమైన సమయం గడపడానికి, టీచర్లు సకాలంలో అందుబాటులో ఉండటానికి మరింత వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ సిబ్బంది, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిడ్ డే మీల్స్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఇకపోతే ఇటీవలే మిడ్ డే మీల్స్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల్లో ఒకరు ఎందుకు మధ్యాహ్న భోజనం తినకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయులు అలా చేస్తే విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన సురక్షిత భోజనం అందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారాన్ని ప్రమాణాలకు అనుగుణంగా అందించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది. ‘ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రతి రోజు ఉపాధ్యాయుల్లో ఒకరు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని తెలిపింది. వంట పనుల్లో విద్యార్థులను భాగస్వాములను చేయొచ్చు. గతంలో ఇలాగే ఉండేది. ఇది పని చేసేవారి పట్ల విద్యార్థుల్లో గౌరవాన్ని పెంచుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’అని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. తాజాగా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ , కాలేజీల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి ఉచిత భోజనం, సీఎం బ్రేక్ ఫాస్ట్ అమలు చేస్తాం అని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు రాగిజావ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు మరింత పౌష్ఠికాహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగి జావను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. వారంలో 3 రోజుల పాటు విద్యార్థులకు రాగిజావను అందిస్తారు. ప్రతి విద్యార్థికి 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి చొప్పున పాఠశాలలకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టుకు అప్పగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *