పయనించే సూర్యుడు న్యూస్ : ‘నిర్వాసితులకు న్యాయం చేస్తాం… వెలిగొండ పూర్తి చేస్తాం… నాదీ గ్యారెంటీ’అని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధి రైతులు, నిర్వాసితులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధుల చెక్కును అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా… ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాము పాలన చేపడుతున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని.. అలాగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ఇందుకు తనది గ్యారెంటీ ఆంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2,351 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిమిత్తం రూ.300 కోట్ల విలువైన చెక్కును ముఖ్యమంత్రి అందించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర… మార్కాపురం జిల్లా అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ
జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించాం
గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ది చెప్పాలి
ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం