అక్షర ఆయుధం : గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పెద్ద నగరాల్లో ఎక్కువ ఆదాయం, మెరుగైన ఉద్యోగావకాశాలు, నిరుద్యోగం తక్కువగా ఉన్నాయని జాతీయ గణాంక కార్యాలయం (NOS) రిపోర్ట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏ నగరాల్లో ఎక్కువగా సంపాదిస్తున్నారనే జాబితాను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జీవన వ్యయం ( Cost of Living )లో వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఏ నగరాల్లో నివసించే ఎక్కువగా సంపాదిస్తున్నారో తెలుసా? ఇండియాలో 46 మిలియన్ నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం, మెరుగైన ఉద్యోగావకాశాలు, నిరుద్యోగం తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం రిపోర్ట్‌లో పేర్కొంది. జాతీయ గణాంక కార్యాలయం (NOS) ఈ డేటాను వెల్లడించింది.స్వయం ఉపాధి ద్వారా 34 శాతంస్వయం ఉపాధి పొందే వారి సంఖ్య పెరిగిందని ఈ రిపోర్ట్‌లో పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, సూరత్, పాట్నా వంటి నగరాల్లో వ్యాపారం చేస్తున్న లేదా స్వతంత్రంగా పనిచేస్తున్న వారు నెలకు సరాసరిగా రూ.30,858 ఆదాయం పొందుతున్నారు. ఇతర పట్టణ ప్రాంతాల్లోని స్వయం ఉపాధి కార్మికుల కంటే సుమారు 34శాతం ఎక్కువ. ఇది భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో బలమైన బిజినెస్ ఎకో సిస్టమ్‌ను సూచిస్తోంది. రెగ్యులర్‌గా వేతనం పొందే ఉద్యోగుల వేతనం కూడా పెరిగింది. వివిధ నగరాల్లో నెలవారి జీతం రూ.28,808 గా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే 10 శాతం అధికంగా ఉంది. సాధారణ కార్మికుల వేతనం రూ.554 నుండి రూ.624 వరకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కార్మికులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇండియాలోని పెద్ద పెద్ద నగరాలు కూడా క్రమంగా ఉపాధికి అధికారిక కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నగరాల్లో ఇప్పుడు 55 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు జీతభత్యాలు పొందే ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే కాదు ఉద్యోగాలు చేసే ప్రతి నలుగురిలో ఒకరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేస్తున్నారు. ఇది నేషనల్ అర్బన్ యావరేజ్ కంటే ఎక్కువ. కార్మికులకు మెరుగైన ఉద్యోగ భద్రత , వృత్తిపరమైన అభివృద్ధి లభిస్తోంది.తగ్గిన నిరుద్యోగంగత కొన్నేళ్లలో -జాబ్ మార్కెట్లో వృద్ధి కనిపించిందని రిపోర్ట్పేర్కొంది. ఇండియాలోని అతిపెద్ద నగరాల్లో నిరుద్యోగం 2017-18లో 7.9 శాతం కాగా, 2025లో అది 4.9 శాతానికి తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు , ఉద్యోగ కల్పన బలోపేతమవుతుందని ఈ స్థిరమైన తగ్గుదల సూచిస్తోంది.ఏ నగరాల్లో ఎక్కువగా సంపాదిస్తున్నారంటే….ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా అతి పెద్ద కేంద్రాలుగా కోల్‌కతా, సూరత్ మరియు గ్రేటర్ హైదరాబాద్ నగరాలు నిలిచాయి. దేశంలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లోని మొత్తం వ్యాపార సంస్థల్లో ఈ మాడు నగరాల వాటానే 22 శాతం కంటే ఎక్కువగా ఉందని NOS రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో ఈ నగరాలు ఉపాధి కల్పనకు, ఆర్థివృద్దికి ఎంతో దోహదం చేస్తున్నాయి.పెద్ద నగరాల్లో ఎక్కువ ఉద్యోగాలుఇండియాలోని అతి పెద్ద నగరాల్లో ఉన్న వ్యాపారాలు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అతి పెద్ద నగరాల్లో 24 శాతం సంస్థలు కనీసం ఒక ఉద్యోగిని నియమించుకుంటున్నాయి, పట్టణ ప్రాంతాల్లో ఇది 19 శాతంగా ఉంది. ప్రైవేట్ రంగం బలపడటాన్ని, వివిధ పరిశ్రమలలో ఉపాధిని కల్పించే అధిక సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది.