రాష్ట్ర అభివృద్ధిపై సినీ నటుల పాత్రను ప్రస్తావించిన భట్టి విక్రమార్క

సాక్షి డిజిటల్ న్యూస్: రాష్ట్ర అభివృద్ధిలో మాకూ బాధ్యత ఉందని భావించి, సినీ ప్రముఖులంతా ‘సే నో టు డ్రగ్స్’ పై వీడియో రికార్డెడ్ సందేశాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అవసరమైతే ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను మీ వద్దకు పంపి ఆ సందేశాలను రికార్డ్ చేయించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖు నటులు, ఇతరులపై తెలగాణ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీనటులు, సెలబ్రిటీలు ప్రజలు ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేవాళ్లు అని చెప్పుకొచ్చారు. సినీరంగ ప్రముఖులు ఒక పిలుపు ఇచ్చినా ఒక సందేశం ఇచ్చినా యువత దాన్ని స్వీకరిస్తుందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.స్కూళ్లు, కాలేజీల్లో కౌన్సెలింగ్ ఇస్తూనే, సమాజాన్ని ప్రభావితం చేయగల నాయకులు, సెలబ్రిటీలు దీనిపై వీడియో, ట్వీట్ చేసి అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. యువత భవిష్యత్‌ను మార్చే సత్తా సినీనటులకు ఉంది సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, నటులు, ప్రముఖ దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇచ్చే చిన్న సందేశం అనేకమంది యువతీ యువకుల భవిష్యత్తును మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధిలో మాకూ బాధ్యత ఉందని భావించి, సినీ ప్రముఖులంతా ‘సే నో టు డ్రగ్స్’ పై వీడియో రికార్డెడ్ సందేశాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను మీ వద్దకు పంపి ఆ సందేశాలను రికార్డ్ చేయించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. పోలీస్ యంత్రాంగం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ముఖ్యంగా ‘ఈగిల్ ఫోర్స్’కు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. డ్రగ్ రహిత తెలంగాణ కోసం అందరం చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుందామని…చిన్నారుల మేధస్సు ప్రపంచానికి ఉపయోగపడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *