ప్రపంచంలో అత్యుత్తమ నాయకుల్లో మోదీ ఒకరు: డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

పయనించే సూర్యుడు న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచంలోని అత్యుత్తమ నాయకులలో ఒకరిగా అభివర్ణించారు. ఆక్సియోస్ కిచ్చిన తాజా ఇంటర్వ్యూలో మోదీ చాలా బలమైన నాయకుడని ప్రశంసించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో కూడా మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ప్రపంచంలో ఇద్దరు అత్యుత్తమ నాయకులు ఉన్నారని అందులో ఒకరు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాగా మరొకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్ సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న తీరు దేశాన్ని పాలిస్తున్న విధానం ఎంతో అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. మోదీ సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్నారని ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు మోదీ దూరంగా ఉంటున్నారని ఇది చాలా తెలివైన నిర్ణయమని ఆయన కితాబిచ్చారు. గతంలో తాను భారతదేశ రాజకీయాలను ఎప్పుడూ గమనిస్తుండేవాడినని అక్కడ ఆరు నెలలు లేదా ఏడాదికోసారి నాయకులు మారిపోయేవారని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. కానీ మోదీ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గత పన్నెండేళ్లుగా ఆయన ఎంతో బలంగా పదవిలో కొనసాగుతున్నారని కొనియాడారు. మోదీ చూడటానికి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారని కానీ వాస్తవానికి ఆయన చాలా కఠినమైన బలమైన వ్యక్తి అని ట్రంప్ స్పష్టం చేశారు. మోదీని దగ్గరగా చూశానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *