అక్షర ఆయుధం ‘ప్రస్తుత తరం యువతకు యోగాసాధనను అలవాటు చేస్తే అద్భుతమైన భవిష్యత్తును వారికి అందించినట్టు అవుతుంది. ప్రజా రోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘సంజీవనిలో భాగంగా యోగాసాధన, ప్రాణామయం వంటివి కూడా చేరుస్తున్నాం. సంజీవని కార్యక్రమంలో రోగ చికిత్స కంటే.. రోగ నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబాతో నాకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. రాం దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారు.వేలాది మంది స్వచ్ఛంధంగా వచ్చి రాం దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ఉండవల్లి గుహల వద్ద రాందేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు పలు యోగా ప్రక్రియల గురించి వివరించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడు ఎదుట చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమానాసన్, రాజ్ కపోతాసన్, పవర్ యోగా వంటి ప్రక్రియలను రాం దేవ్ బాబా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన రాం దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఉండవల్లి గుహల వద్ద యోగాసాధన చేయడం విశేషం. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. పద్మనాభ స్వామి ఈ ఉండవల్లి గుహల్లో కొలువై ఉన్నాడు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.నేను 30 ఏళ్లుగా టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా‘దేవతల రాజధాని అమరావతి స్పూర్తితో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దు తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘నేను 30 ఏళ్ల నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను… రామ్ దేవ్ బాబా యోగాను ప్రమోట్ చేస్తున్నారు. టెక్నాలజీ వితవుట్ అడిక్షన్ అనే విధానంలో వెళ్లాలి… దీనికి ఆధ్యాత్మిక, యోగా వంటివి ఉపకరిస్తాయి. ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు… 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘యోగాతో శరీరం, మెదడు అనుసంధానం అవుతాయి. మన విలువలను కాపాడుకోవాలి.. భావితరాలకు అందించాలి. అమరావతి, విజయవాడల్లోని వివిధ ప్రాంతాల్లో యోగాభ్యాసం చేస్తూ.. మీడియా ద్వారా ప్రచారం చేయడానికి రాందేవ్ బాబా సంకల్పిచారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాం దేవ్ బాబాకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఏపీని దేశానికి ఆథ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాబాను కోరుతున్నాను. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం.. 20 లక్షల రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు. రసాయన రహిత పంటలను ప్రజలకు అందించే లక్ష్యంతో పని చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగా సాధన కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ‘ఆధ్యాత్మికతో వికసిత్ భారత్ సాధించాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారు… ఆయనకు సహకరిద్దాం. యోగా సాధన కోసం ఉద్యమ స్పూర్తితో పని చేయాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ప్రస్తుత తరానికి యోగాసాధనను అలవాటు చేస్తే.. అద్భుతమైన భవిష్యత్తును వారికి అందించినట్టు అవుతుంది. ప్రజా రోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నాం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘సంజీవనిలో భాగంగా యోగాసాధన, ప్రాణామయం వంటివి కూడా చేరుస్తున్నాం. సంజీవని కార్యక్రమంలో రోగ చికిత్స కంటే.. రోగ నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.