సాక్షి డిజిటల్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలో 11 వేల మంది కర్ణాటకకు చెందిన ఓటర్లు ఉన్నారు అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కొడంగల్‌లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని ఆ డూప్లికేషన్, అక్రమ రిజిష్ట్రేషన్ ఓట్లతోనే గెలుపొందారంటూ కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ మసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కర్ణాటక ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్‌లో ఓటర్లుగా ఉన్నారని ఆరోపించారు. కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. సరిగ్గా అంతే మార్జిన్‌తో ఆయన గెలిచారు. అంటే సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా? అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సందేహం వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు… ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? అని ప్రశ్నించారు. బోధన్‌లో ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తీసేస్తే… కొడంగల్‌లో 800 ఓట్లు మాత్రమే తీసేశారు? వీటన్నింని పరిశీలిస్తే SIR మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అన్నింటిపై ఈసీ క్లారిటీ ఇవ్వాలి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బోధన్‌లో 7 వేల ఓట్లు తొలగింపుపై కవిత అభ్యంతరం ‘అసలు ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను ఏరివేసే మెకనిజం ఈసీ వద్దా ఉందా?. అది లేకుంటే 14 వందల కోట్లతో చేపట్టిన ఎస్ఐఆర్ దండగే’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానం ఉండాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై మాకు చాలా అనుమానాలున్నాయి. సాధారణంగా SIRకు రిఫరెన్స్‌ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలి. కానీ 2025 జనవరి నుంచి వీళ్లు SIRకు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారు’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.‘ఏటా నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ అయిన జనవరి 1వ తేదీనే తీసుకోవాలి. కానీ అలా కాకుండా గతేడాది జనవరి 1 తేదీని ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ చేశారు. ఐతే మా భోదన్‌లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే అక్కడ 7 వేలకు పైగా ఓట్లను తీసేశారు. వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా? డూప్లికేషన్ ఓట్ల అనేది ఈసీ చెప్పటం లేదు’అని కవిత ధ్వజమెత్తారు.ప్రకాష్ రాజ్ ఓటు తొలగించేందుకు ఏడేళ్లు‘జనవరి 1, 2025 నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో ఒక్క భోదన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ 7వేల ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని మేము ఈసీని కోరుతున్నాం’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్‌కి మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారు. ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏళ్లు పడితే భోదన్‌లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉంది. కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదు. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అని నిలదీశారు. కొడంగల్‌లో 33వేల ఓట్లు డూప్లికేట్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నవే‘మా భోదన్‌లో 7 వేల ఓట్లు తొలగించటంతో మేము మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో కొడంగల్‌లో చెక్ చేశాం. అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారు. భోదన్‌లో ఏడు వేలు ఎలా? కొడంగల్‌లో 8 వందలు మాత్రమే ఎలా? కొడంగల్‌లో దాదాపు 22, 433 డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. అందులో దాదాపు వెయ్యి వరకు మేము ప్రింట్ తీశాం. 2018 లో కొడంగల్ ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయి’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. ‘పైగా కొడంగల్‌కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్‌లో ఉన్నారు. సెడంలోనూ కొడంగల్ లోనూ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారు? కొడంగల్‌లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తోంది’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కర్ణాటక నుంచి ఓట్లు ట్రాన్స్‌పర్ అయ్యాయి‘రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటీ? కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యాయా?’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో వేరే దేశంలో వాళ్లకు ఓట్లు ఉండవద్దని అంటున్నారు. దానికి మేము అంగీకరిస్తాం. కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా?. మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా?. అసలు ఇంటర్ స్టేట్‌లో ఓట్ల డూప్లికేషన్‌ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదు’అని కవిత అన్నారు. ‘అలాంటప్పుడు 14 వందల కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటీ?. ఈ SIR ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలి. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితి ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలి’అని కవిత డిమాండ్ చేశారు. SIR అనేది పర్మినెంట్ సొల్యూషన్‌గా ఉండాలి‘దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలి? ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్‌లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి. SIR ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలి. లేదంటే SIRకు అర్థం ఉండదు’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘SIR అనేది పర్మినెంట్ సొల్యుషన్‌గా ఉండాలని మేము కోరుతున్నాం. మాలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫెయిర్‌గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరుతున్నాం. మేము లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు.