జనం న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే రెండేళ్లు ఎంతో కీలక సమయం అని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే రెండేళ్లు ఎంతో కీలక సమయం అని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ రెండేళ్లు ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోవాలని, పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలపై పోరాడాలని కోరారు. నిత్యం ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరి బాధ్యత తనది అని స్పష్టం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వైఎస్ జగన్ గురువారం రోజున రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…. ‘‘ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో జరిగిన పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్‌ను చూశాం. ఆయన 5 ఏళ్ల పాలన చూశాం. ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలన మధ్య తేడా ఏమిటనేది ఈరోజు ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా ఉంది. మన 5 ఏళ్ల పాలనలో గర్వంగా చెప్పగలుగుతాను. గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించాం. దీన్ని నేను గర్వంగా చెప్పగలను’’ అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి… 99 శాతం అమలు చేశామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నార. గతంలో తమ హయాంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వైఎస్ జగన్ ఆరోపించారు. ‘‘ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు. జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫోటోలు, సంతకాలతో బాండ్లు పంపారు. ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా?. అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు. ఇంకా 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని, ఇంకా 18 ఏళ్లు నిండిన యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. నిరుద్యోగి ఉంటే ఏడాదికి రూ.36 వేలు. అంతటితో ఆగలేదు. మీకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు. అలా అంతా మోసం. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. అలా మన కన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మ్యానిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. ఎన్నికలైపోయాయి.