అక్షర ఆయుధం : రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులుకు దిగింది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక మౌలిక సదుపాయాలపై పెద్ద సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రష్యా, ఉక్రెయిన్ల యుద్దం నాలుగేళ్లకు పైగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులుకు దిగింది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్… ఉక్రెయిన్ గత రెండేళ్లలో మాస్కోపై అతిపెద్ద డ్రోన్ దాడిని ప్రారంభించిందని తెలిపింది. ఈ దాడిలో ఒక కీలకమైన చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతిందని, మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతమంతా శిథిలాలు వర్షంలా పడ్డాయని పేర్కొంది.మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ మాట్లాడుతూ… గురువారం తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కో వైపు వస్తున్న కనీసం 194 డ్రోన్లను వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం… అజోవ్ సముద్రంతో సహా రష్యాలోని విశాలమైన ప్రాంతంపై ఉక్రెయిన్ భారీ దాడికి దిగింది. అయితే రష్యా వాయు రక్షణ వ్యవస్థలు 555 డ్రోన్లను అడ్డుకున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా విమానయాన సంస్థను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. అయితే ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్… రష్యా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర దాడులను ముమ్మరం చేసింది. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఒక కీలక వ్యూహమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. నాటో నాయకులతో సమావేశాల కోసం ఇటీవల బ్రస్సెల్స్కు చేరుకున్న జెలెన్ స్కీ అక్కడి నుంచే ఒక టెలిగ్రామ్ పోస్ట్‌లో… గురువారం జరిగిన దాడులను ఉక్రెయిన్ నగరాలు, ప్రజలపై రష్యా దాడులకు సమర్దవంతమైన ప్రతిచర్య అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లక్ష్యాలలో ఆగ్నేయ కపోట్న్యా జిల్లాలోని మాస్కో ఆయిల్ రిఫైనరీ కూడా ఉంది. మంగళవారం కూడా ఉక్రెయిన్ ఈ ఆయిల్ రిఫైనరీపై దాడి చేసి దెబ్బతీసింది. ఉక్రెయిన్ దాడుల తర్వాత రష్యాలోనే అతిపెద్ద మాల్గా చెప్పుకునే మాస్కోలోని సదోవోడ్ వాణిజ్య కేంద్రం సమీపంలో భారీ పొగ పైకి లేవడం కనిపించింది. రాజధానిలో ఒక అపార్ట్మెంట్ భవనం, ఒక ఫిట్నెస్ సెంటర్ కూడా శిథిలాలు పడటం వల్ల దెబ్బతిన్నాయని టాస్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.మరోవైపు ఈ దాడులకు రష్యా ప్రతీదాడులు కూడా చేసింది. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం…