సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపునకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.1.621 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి చేరినట్లు అయింది. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు గుడ్న్యూస్ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సౌధలోని జెన్ కో ప్రధాన కార్యాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పచ్చ జెండా ఊపారు. విద్యుత్ ఉద్యోగులకు 1.621 శాతం మేర డీఏను పెంచుతూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి చేరినట్లు అయింది. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగా వాట్లు ప్రధానంగా రాబోయో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ అధికారులు సన్నద్ధం కావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ఆయన అధికారులుకు పలు సూచనలు చేశారు. ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో గరిష్ట డిమాండ్ ఎదురైనా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసిన అధికారులను, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు చేరిందన్నారు. అయినా సరఫరాలో అంతరయాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు, సిబ్బంది పని చేశారని ఆయన అన్నారు. అలాగే మార్చి 13, 2026 న అత్యధికంగా 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైనా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.2035-36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాబోయే దశాబ్ద కాలానికి సమగ్రమైన, దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేయాలని విద్యుత్ రంగ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరించాలని అన్నారు. రాష్ట్రంలో 2035-36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనాగా చెప్పారు. ఈ ఏడాది నమోదైన పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు దాదాపు రెట్టింపుగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా 2035-36 నాటికి వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు (MU) చేరుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.