సాక్షి డిజిటల్ న్యూస్: ముడి చమురు బ్యారెల్ ధర ప్రస్తుతం 70 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ తగ్గుదల వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై ఉన్న ఒత్తిడిని తగ్గింది. ఇదిలా ఉంటే క్రూడాయిల్ ధరలు తగ్గినందున వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముడిచమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గుతున్నాయి. ఈనేపథ్యంలో భారత్ కు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకుంటే మన దేశం తన ఎనర్జీ అవసరాల కోసం దాదాపు 90 శాతం విదేశీ చమురు పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి రావడంతో ఇంధన సంక్షోభం నుంచి భారత్ కు ఊరట లభిస్తోంది. ముడి చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గడం వల్ల, భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది. ముడి చమురు బ్యారెల్ ధర ప్రస్తుతం 70 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ తగ్గుదల వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై ఉన్న ఒత్తిడిని తగ్గింది. ఇదిలా ఉంటే క్రూడాయిల్ ధరలు తగ్గినందున వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన క్రూడాయిల్ ధరలతో బిగ్ రిలీఫ్… భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర ప్రస్తుతం 68.86 డాలర్లకు పడిపోయింది. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు 70 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మార్చి 23న బ్యారెల్‌కు 157 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. దీంతో పోల్చితే ప్రస్తుతం క్రూడాయిల్ ధర 56% కంటే తక్కువగా ఉంది. క్రూడాయిల్ ధరల తగ్గుదలతో ఇండియన్ ఆయిల్, హెచ్‌పి (HP), భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. క్రూడాయిల్ ధర 50% కంటే ఎక్కువ తగ్గినా కూడా సామాన్య ప్రజలకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల రూపంలో ఉపశమనం వెంటనే లభించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారను. చమురు మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్ అమ్మకాలపై లీటరుకు సుమారు రూ. 5 నుండి రూ. 6 వరకు లాభం పొందుతున్నాయి, కానీ డీజిల్ అమ్మకాలపై మాత్రం లీటరుకు సుమారు రూ. 8 నుండి రూ. 10 వరకు నష్టాన్ని చవిచూస్తున్నాయి. అందుకే ఆ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను వెంటనే తగ్గించడానికి ఆసక్తి చూపడం లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో చమురు సంక్షోభ సమయంలో వాటిల్లిన భారీ నష్టాలను పూడ్చుకోవాలని కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.