యాదగిరిగుట్ట భూముల కేటాయింపుపై తిరుమల విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

పయనించే సూర్యుడు న్యూస్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జూన్ 30) రోజున హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు యాదగిరిగుట్ట దేవస్థానంకే ఉండాలని చెప్పారు. ఆలయం పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని సూచించారు. గుట్టపైన అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి జాబితా రూపొందించాలని, అతిథి గృహాల నిర్మాణాల్లోనూ టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అనుసరించాలని… దశల వారిగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన కూడా స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం రూపొందించాలని అన్నారు. ఆలయ పరిధిలోవివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని… అందుకే మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని… అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *