చదువుకుంటూనే నెలకు రూ.10 వేల సంపాదన అవకాశం!

*ఏపీ విద్యార్థులకు బంపర్ ఆఫర్..

జనం న్యూస్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వర్క్ స్టడీ మోడల్ విశ్వవిద్యాలయం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఈ విధానంలో విద్యార్థులు తమ స్టడీలో మూడోవంతు సమయం మాత్రమే క్యాంపస్‌లో చదువుతారు. మిగిలిన సమయంలో పరిశ్రమల వద్ద ఇంటర్న్‌షిప్‌గా పనిచేస్తారు.మొదటి సంవత్సరం నుండే విద్యార్థులకు కనీసం నెలకు రూ.10,000 స్టైపెండ్ అందుతుంది. విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలను సాధిస్తూ సంపాదించే వర్క్ స్టడీ మోడల్ విశ్వవిద్యాలయం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో SIU గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్, గవర్నింగ్ బోర్డు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. ఎస్ఐయు వర్క్ – స్టడీ (పని చేస్తూ-చదువు) డ్యుయల్ మోడల్‌ విధానంలో ఏర్పాటైంది. ఈ మోడల్ ద్వారా ప్రతి విద్యార్థి స్టడీ సమయంలో నేర్చుకున్న విద్యతో పాటు వాస్తవ ఉద్యోగ అనుభవం పొంది మార్కెట్‌కు సిద్ధమవుతాడు. భారత్ లో ప్రతిఏటా సంవత్సరానికి 90 లక్షలకి పైగా గ్రాడ్యుయేట్స్ వివిధ యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. అందులో సుమారు 42.6% మంది మాత్రమే సంబంధిత నైపుణ్యాల్లో అర్హులని ఒక అధ్యయనంలో తేలింది. చాలా మంది తమ అర్హత కన్నా తక్కువ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. చాలామంది ఉద్యోగార్థుల్లో నైపుణ్య లోటు స్పష్టంగా కన్పిస్తోంది. నాన్ ప్రాఫిటబుల్ విద్యాసంస్థ ఎస్ఐయు SIU ఒక దాతృత్వ ఉద్దేశంతో స్థాపించబడింది. టెక్నాలజిస్టులు, పారిశ్రామిక నిపుణులు, దాతలు కలిసి ఈ యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. ఇది Sricity Education Foundation ద్వారా AP State Private Universities Act కింద ఏర్పాటు చేయబడి, Section 8 కంపెనీగా నాన్ ప్రాఫిటబుల్ విద్యాసంస్థగా పనిచేస్తోంది. వర్క్-స్టడీ మోడల్ ఎలా పని చేస్తుంది? ఈ విధానంలో విద్యార్థులు తమ స్టడీలో మూడోవంతు సమయం మాత్రమే క్యాంపస్‌లో చదువుతారు. మిగిలిన సమయంలో పరిశ్రమల వద్ద ఇంటర్న్‌షిప్‌గా పనిచేస్తారు. మొదటి సంవత్సరం నుండే విద్యార్థులకు కనీసం నెలకు రూ.10,000 స్టైపెండ్ అందుతుంది. పనిలో నిపుణత పెరిగే కొద్దీ పరిశ్రమలు స్టైపెండ్ పెంచతాయి. నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసే సమయానికి వాస్తవ పని అనుభవం (సుమారు 2+ సంవత్సరాలు) వస్తుంది. పాఠ్యాంశాల ప్రణాళిక కోర్సులు పరిశ్రమలతో కలిసి రూపకల్పన చేయబడతాయి. ప్రతి ఏడాది ఏఐ, పరిశ్రమ మార్పులకు అనుగుణంగా పాఠ్యక్రమాన్ని నవీనీకరిస్తారు. విద్యార్థుల భవిష్యత్తు పనికి అవసరమైన నైపుణ్యాలు, సామర్ధ్యాలు నేర్చుకుంటారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ క్యాంపస్‌లో Station-S అనే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. Station-S, Gnan Circle Ventures సహాయంతో సుమారు 10 స్టార్టప్స్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఇక్కడ పరిశ్రమ అనుకూల విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, సృజనాత్మక మేధస్సు పెంపొందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *