అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన

పలు జిల్లాలకు హెచ్చరికలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 3న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్ అలర్ట్… రాష్ట్రంలో రానున్న వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 3న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్టవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఏపీలో వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు కూడా పుంజుకునే అవకావశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నెలకొన్న పొడి వాతావరణం నుంచి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు భారీ ఉపశమనం లభించే అవకావశం ఉంది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్‌ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి వాతావరణ శాఖ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో జూలై 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం తదుపరి మరింతగా బలపడుతుందా? లేదా? అనే అంచనాను మాత్రం వెల్లడించడలేదు. అయితే అల్పపీడనం జూలై మొదటి వారంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలాఉంటే, రాషట్రంలో ఇప్పటివరకు తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల పలు జిల్లాల్లో ఖరీఫ్ సాగు పనులకు అంతరాయం కలిగింది. జూలై మొదటి వారంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తాజా అంచనా రైతులకు కొంత ఆశను కల్పిస్తోంది. ఎందుకంటే… ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అల్పపీడనం వంటి వాతావరణ పరిస్థితుల వల్ల కురిసే వర్షాలు రైతులకు మేలు చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *