సాక్షి డిజిటల్ న్యూస్: నలగంపల్లి గ్రామంలోని ఓ ఇంటిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ ప్యానెళ్ల సంఖ్య, విద్యుత్ ఉత్పత్తి, ఇంటి అవసరాలకు సరిపోతుందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగిస్తూ నెలకు సుమారు రూ.400 వరకు ఆదా చేస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్ట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. నెట్‌జీరో విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నలగంపల్లి గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుప్పం పర్యటన రెండో రోజు శనివారం నలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న ఇళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి….సోలార్ రూఫ్‌టాప్ సోలార్, ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను పరిశీలించారు.కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రెండో రోజు పర్యటించారు.కడపల్లెలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కుప్పం స్థానికులు చేరుకున్నారు.ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు నాయుడు అప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు. నలగంపల్లె గ్రామంలో నెట్ జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.గ్రామంలోని రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్‌టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నలగంపల్లిలోని ఓ గ్రామస్థుని ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు.ఎన్ని ప్యానెళ్లు పెట్టారు.. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇంటి అవసరాలకు సరిపోతుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.నలగంపల్లి నమూనాను కేస్ స్టడీగా తీసుకుని కుప్పం వ్యాప్తంగా నెట్‌జీరో విధానాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీని గ్రామస్థాయిలో అమలు నలగంపల్లి గ్రామంలోని ఓ ఇంటిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ ప్యానెళ్ల సంఖ్య, విద్యుత్ ఉత్పత్తి, ఇంటి అవసరాలకు సరిపోతుందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగిస్తూ నెలకు సుమారు రూ.400 వరకు ఆదా చేస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్ట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. నెట్‌జీరో విధానంలో భాగంగా ఈవీ వాహనాల వినియోగాన్ని కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సర్క్యులర్ ఎకానమీని గ్రామస్థాయిలో అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నలగంపల్లి అనుసరిస్తున్న విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇండక్షన్ స్టవ్‌లతో ప్రస్తుతం అన్ని రకాల వంటలు చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గ్యాస్ లీకేజీ ప్రమాదాలు తగ్గడంతో పాటు భద్రత పెరుగుతుందని గ్రామస్థులు సీఎంకు వివరించారు. కుప్పంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ విస్తరణ ద్వారా 7,489 మంది ఎస్సీ, ఎస్టీలు, 39,215 మంది బీసీలు, 7,381 మంది ఓసీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈ విధానాన్ని కుప్పం అంతటా విస్తరించి ప్రజల విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.