‘‘ఆస్ట్రేలియా వస్తే చంపుతాం’’.

* ప్రధాని మోదీకి ఆగంతకులు బెదిరింపులు

జనం న్యూస్ : ఈ నెల 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధానిని చంపుతామంటూ సోషల్ మీడియాలో ఆగంతకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని, కేసు నమోదుచేశారు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా… జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆస్ట్రేలియా వస్తే చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో భారత ప్రధానిని చంపుతామని బెదిరిస్తూ పెట్టిన పోస్ట్ కలకలం రేపడంతో ఆస్ట్రేలియా పోలీసులు ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. దీంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. జులై 9న మెల్‌బోర్న్‌‌లో మోదీ కార్యక్రమం ఉండటంతో అప్రమత్తమయ్యారు. మెల్‌బోర్న్ మీట్స్‌‌కు ఆస్ట్రేలియా పోలీసులు భద్రత కల్పించారు. ‘‘ఈ కార్యక్రమం జరిగేటప్పుడు స్టేడియం పైకప్పులు మూసివేయడం మంచిది, లేకపోతే అతను (మోదీ) చావు కోసం ఆస్ట్రేలియాకు వస్తారు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషయాన్ని అదే రోజు ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులకు నివేదించినట్లు ‘ది ఆస్ట్రేలియా టుడే’ పత్రిక తెలిసింది. విశ్వసనీయ వర్గాలు ‘ది ఆస్ట్రేలియా టుడే’కు తెలిపిన వివరాల ప్రకారం.. దర్యాప్తు అధికారులు విచారణలో భాగంగా ఆ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. అధికారులు ఆ పోస్ట్‌కు సంబంధించిన పరిస్థితులను, ఏవైనా నేరపూరిత చర్యలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించారు. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియా అధికారిక పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ బెదిరింపు ఆరోపణలు వచ్చాయి. ఈ పర్యటనలో ఆయన మెల్‌బోర్న్ సమావేశంతో సహా ద్వైపాక్షిక సమావేశాలు, పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారని భావిస్తున్నారు. పర్యటనకు వచ్చే ప్రభుత్వాధినేతలపై వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా ఫెడరల్ ఏజెన్సీలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తాయి. ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రముఖల పర్యటనల భద్రతలో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక రక్షణ భద్రతా విభాగాలతో సహా పలు ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. ఇదిలా ఉండగా, ప్రధాని జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆయన పర్యటనలో మొదటి ఇండోనేషియా, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు.. చివరిగా జులై 11న న్యూజిలాండ్‌తో ఆయన ఈ పర్యటనను ముగుస్తుందని పేర్కొంది. మోదీ అధికారిక పర్యటనపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెల్‌బోర్న్‌లో జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక, మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీకి అల్బనీస్ స్వాగతం పలుకుతారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *