సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి రంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కుమార్తె ఆశ కిరణ్ కోరారు. రంగాకు అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణానది తీరం సమీపంలో స్మారక ఘాట్ నిర్మాణం చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనలపై రంగా రాధా మిత్రమండలి త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్నట్లు పేర్కొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా పేరును ఏపీలోని ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కుమార్తె ఆశ కిరణ్ కోరారు. శనివారం మోహన రంగా 79వ జయంతి సందర్భంగా విజయవాడలో ఆమె నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా అంత్యక్రియలు కృష్ణానది తీరంలో చేశారని ఆశ కిరణ్ గుర్తు చేశారు. కృష్ణా తీరంలో గంగా స్మారక ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిశీలన చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని ఆశ కిరణ్ మీడియాకు వెల్లడించారు.జిల్లాకు పేరు, స్మారక ఘాట్‌పై ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ఆశ కిరణ్ వెల్లడించారు.పెద్ద పెద్ద నాయకులకు స్మారక ఘాట్లు ఉన్నాయని… కానీ తన తండ్రి రంగాకు లేదని అన్నారు. దివంగత వంగవీటి మోహన రంగా అంటే తనకు అభిమానమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే అన్నారని…త్వరలోనే ఆయన్ను కలిసి లెటర్ ఇస్తామని చెప్పారు. తమ వినతిని అంగీకరిస్తారనే నమ్మకం ఉందని ఆశ కిరణ్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది: ఆశ కిరణ్ వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆశ కిరణ్ పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్బంగా తన తండ్రి వంగవీటి మోహన రంగా సేవలు, నాయకత్వం త్యాగాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు రంగా జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని… ఆయన చనిపోయి ఇన్నేళ్లయినా ఇప్పటికీ విగ్రహావిష్కరణలు జరుగుతుండటం గొప్ప విషయం అని కొనియాడారు. ప్రజల్లో ఆయన పై తగ్గని ప్రేమాభిమానాలకు నిదర్శనం వంగవీటి రంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆశ కిరన్ కోరారు. రంగాకు అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణానది సమీపంలో స్మారక ఘాట్ నిర్మాణం చేయాలి అని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సభల్లో రంగపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అయితే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నందున తమ విజ్ఞప్తులను పరిశీలిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. త్వరలోనే రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలిసి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని ఆశ కిరణ్ పేర్కొన్నారు.