పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్షారావు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లిలు వేర్వేరుగా ప్రకటనలు ఇవ్వడంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి’అని మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీమంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్తోంది అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన SIRపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాజీమంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని…ప్రభుత్వ పెద్దల మధ్యే లెక్కల్లో పొంతన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.మంత్రి జూపల్లి లెటర్ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలో సంగారెడ్డిలో పీపీటీ ద్వారా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.