ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి

సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్: ‘ఆధునిక టెక్నాలజీతో దేశంలో అతి పెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. స్థానిక కోళ్ల పెంపకం దారులు ఈ సంస్థ ద్వారా లబ్ది పొందుతారు’అని సీఎం చంద్రబాబు అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పంలో వివిధ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు.జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి నేరుగా కుప్పం వచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి, రైతులకు మార్కెట్, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించనున్నాయి. చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామంలో 30.75 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏబీఐఎస్ ప్రోటీన్స్ గ్రీన్‌ఫీల్డ్ పౌల్ట్రీ, చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్లాంట్ పనితీరును పరిశీలించారు. ప్లాంట్లో ఏయే విభాగాలు ఏ విధంగా పని చేస్తాయన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంపెనీకి చెందిన యాజమాన్య ప్రతినిధులు వివరించారు. ఆ సంస్థ నిర్వహించిన జాబ్ ఫెయిర్ లో ఉద్యోగాలు పొందిన యువతకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందించారు. ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తిని ఆ సంస్థ ప్రారంభించనుంది. ఈ పరిశ్రమ ద్వారా మొత్తం 1,400 మందికి ఉపాధి లభించనుండగా, అందులో 700 ప్రత్యక్ష, 700 పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. ప్రారంభ దశలోనే 300 నుంచి 400 మందికి ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ యూనిట్ ద్వారా స్థానిక పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు ధరలకు మార్కెట్ లభించడంతో పాటు, ఒప్పంద పద్ధతిలో కోళ్ల పెంపకానికి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఫీడ్ సరఫరా, రవాణా, అనుబంధ రంగాలకు కూడా ఈ పరిశ్రమ ఊతం ఇవ్వనుంది. పొగురుపల్లెలో 44.58 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన APIIC ఎంఎస్‌ఎంఈ పార్క్ ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పార్కులో 167 పారిశ్రామిక ప్లాట్లను జూలై నెల నుంచే పారిశ్రామికవేత్తలకు కేటాయింపు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రూ.25 కోట్లతో రెస్కోకు చెందిన 5 సబ్ స్టేషన్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు ఒకేచోట కల్పించడం ద్వారా కొత్త పరిశ్రమలు వేగంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, కుప్పం పారిశ్రామిక హబ్‌గా మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ఈ పార్క్ దోహదపడనుంది. ఇక 7,489 మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూరేలా రూ. 28 కోట్లతో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. అలాగే కనమాన పల్లి, గంగాపురం, టీ సముద్రం, కృష్ణానగర్, బళ్ల గ్రామాల్లో రూ. 25 కోట్లతో రెస్కోకు చెందిన 5 సబ్ స్టేషన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ‘కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు, ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పొగురుపల్లెకు బయలుదేరిన సీఎంకు దారి పొడవునా గ్రామస్థులు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు. ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఇప్పటికే 400 మందికి ఉపాధి కల్పించింది’.‘గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆధునిక టెక్నాలజీతో దేశంలో అతి పెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. స్థానిక కోళ్ల పెంపకం దారులు ఈ సంస్థ ద్వారా లబ్ది పొందుతారు. రైతులకు ప్రయోజనం కలగటంతో పాటు పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. చాలా తక్కువ సమయంలో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి… కార్యకలాపాలను ప్రారంభించేలా చేసినందుకు సంస్థకు అభినందనలు. కుప్పం నియోజకవర్గానికి రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీని పెంచుతున్నాం. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు.. జీవన ప్రమాణాలను పెంచేలా పరిశ్రమలు తెచ్చాం. వస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ కూడా సిద్దం కావాలి. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో దృష్టి పెట్టాలి. కుప్పానికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది…దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ప్రజలది. పరిశ్రమలు, సేవా, వ్యవసాయ రంగాల్లో కుప్పాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *