సైనస్ వ్యాధితో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రభావితం

పవన్ కళ్యాణ్‌కు సైనస్ సమస్య తీవ్రతరం

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఆరోగ్య సమస్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సైనస్ తీవ్ర సమస్యగా పరిణమించిందని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఆరోగ్య సమస్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సైనస్ తీవ్ర సమస్యగా పరిణమించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయించుకన్నారు. అనంతరం కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రోజున పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు… ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన శస్త్ర చికిత్స వివరాలు తెలిపారు. సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినప్పటికీ అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉన్నదని, మరో వారం రోజులలో సర్దుకుంటుందని డాక్టర్లు తెలిపారని అన్నారు. అదే విధంగా సినిమాలకి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో తగిలిన గాయాలను అప్పట్లో పట్టించుకోలేదని అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. భుజం దగ్గరి మజిల్ కి గాయాలు గత అయిదేళ్ల నుంచి ఉన్నాయని… రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని వైద్యులు తెలిపారని పవన్ కల్యాణ చెప్పారు. ఆ సమయం నుంచి వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పుడు అవి తిరగబెడుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, శస్త్ర చికిత్స అవసరం ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌తో అన్నారు. వైద్యులు తెలిపిన సూచనలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు. తగిన విశ్రాంతి తీసుకొని, పూర్తి స్వస్థత పొందాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ స్పందిస్తూ శస్త్ర చికిత్స అనంతరం శాఖాపరమైన రివ్యూలు చేయడం, ఫైల్స్ పరిశీలించడాన్ని ప్రస్తావిస్తూ నిర్దేశిత సమయంలోనే ఆ విధులను నిర్వహిస్తున్నానని వివరించారు. నానికి పవన్ కల్యాణ్ తరఫున థాంక్స్. ‘‘మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత’’ అన్న పవన్ కల్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయని చెప్పింది. ఇక, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నానికి పవన్ కల్యాణ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *