
పయనించే సూర్యుడు న్యూస్ : వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ను జైలులో పెట్టడం నిమిషం పని అని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ను జైలులో పెట్టాలని అనుకుంటే, తనకు ఒక్క నిమిషం పని అని అన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 62.20 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,712 కోట్ల మేర భరోసా పెన్షన్లను చెల్లిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో పెన్షన్ పెంచి చెల్లిస్తామని మాట ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 68,598 కోట్ల మేర లబ్ధిదారులకు భరోసా పెన్షన్లను పంపిణీ చేశాం. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ అన్యాయంగా నన్ను జైలులో పెట్టాడు... నేను అతడిని జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని... నాకు చేతకాదా?, అనుభవం లేదా?... నా ఉద్దేశం అది కాదు... రాష్ట్రం ఇప్పటికే నష్టపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనేదే నా లక్ష్యం. దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలి. ప్రపంచంలోనే నంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేదే నా ధ్యేయం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.