వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మావిగన్‌కు మద్దతు తెలుపాలని అనుకున్నవారు వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ బుధవారం రోజున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికలలో అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే పోరు అని అన్నారు. మావిగన్ అనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారు. మావిగన్‌కు మద్దతు తెలుపాలని అనుకున్నవారు వైసీపీకి ఓటు వేయాలని, అమరావతికి అనుకూలంగా ఉన్నవారు చంద్రబాబుకు ఓటు వేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే అజెండాతో వెళ్తామని… మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని చేరుస్తామని అన్నారు. ప్రజలు ఎలా ఓటు వేస్తారనేది చూద్దామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.