
పయనించే సూర్యుడు న్యూస్ : అందరూ భయపడిందే జరిగింది. మళ్లీ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఇప్పుడిప్పుడే నౌకలు బయలుదేరుతున్నాయి అనుకునే టైంలో ఈ బాంబు పేల్చింది ఇరాన్. అందువల్ల భారతీయులకు పెట్రోల్, గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తీరవు అని కన్ఫామ్ అయిపోయింది. మీ ఇంట్లో గ్యాస్ బండ ఖాళీగా ఉందా? దాన్ని కొన్ని రోజుల తర్వాత రీ-ఫిల్ చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చెయ్యకండి.. వెంటనే రీ-ఫిల్ చేసుకోండి. కొంపమునిగే ప్రకటన ఇరాన్ నుంచి వచ్చింది. "హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నాం" అని ప్రకటించింది. ఎందుకు అంటే.. అమెరికా.. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది అని చెప్పింది. ఈ కారణంగా హార్ముజ్ జలసంధి మీదుగా భారత్‌కి రావాల్సిన నౌకలు వచ్చే పరిస్థితి లేకుండా పోయినట్లే. కాబట్టి.. మన దేశంలో చమురు, గ్యాస్ కొరత అలాగే ఉంటుంది. కాబట్టి.. మనం మళ్లీ అప్రమత్తం అవ్వాలి. అమెరికాకి షాక్ ఇవ్వాలంటే.. కిల్లర్ స్విచ్ ఎక్కడుందో ఇరాన్‌కి తెలుసు. అదే హార్ముజ్ జలసంధి. దాన్ని మూసివేస్తే.. ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సప్లై తగ్గిపోతుంది. దాంతో ప్రపంచ దేశాలు.. "మీ వల్లే ఈ పరిస్థితి" అని అమెరికాపై ఫైర్ అవ్వగలవు. అందుకే ఇరాన్ వ్యూహాత్మకంగా ఈ జలసంధిపై తమ పట్టును కొనసాగిస్తోంది. ఇటీవల రెండు దేశాల మధ్యా శాంతి ఒప్పందం కుదురుతుంది.. జూన్ 19న అధికారికంగా సంతకాలు పెడతారు అనుకుంటే.. అది జరగలేదు. దాంతో ఇరాన్.. తప్పంతా అమెరికాదే అని ఆరోపించి.. జలసంధిని మూసేసింది. ఇప్పుడు ఇండియాకి రావాల్సిన దాదాపు 30కి పైగా నౌకలు.. వచ్చే పరిస్థితి లేనట్లే. అవి ఎప్పటికి వస్తాయో తెలియదు ఇరాన్ పాలకులు ఈ నిర్ణయం తీసుకోవడానికి తెరవెనక ఇరాన్ విప్లవ గార్డ్స్ (IRGC) నావికా దళం ఉందని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక.. చాలా కీలక నిర్ణయాల్ని IRGC తీసుకుంటోంది. ఈ దళం ఎక్కువగా.. హార్ముజ్ జలసంధికి ఒడ్డున ఉన్న ఇరాన్ భూభాగంపై ఉంటుంది. అలాగే అక్కడి దీవులపై కూడా ఉంటుంది. వీరు అటుగా వచ్చే నౌకల్ని కంట్రోల్ చేస్తారు. ఎవరైనా తెగించి ముందుకు వెళ్తే.. క్షిపణి దాడి చేస్తారు. దాంతో వందల కోట్ల విలువైన నౌక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే.. హార్ముజ్ జలసంధి దగ్గర IRGC చెప్పిందే వేదం. వారిని అడ్డుకోవడం అమెరికా వల్ల కూడా కావట్లేదు. అసలు ఇరాన్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నకు చాలా ఆన్సర్లు ఉన్నాయి. ఇరాన్ నౌకలు హార్ముజ్ దాటి వెళ్లకుండా అమెరికా.. నావల్ బ్లాకేడ్ విధించింది. దాన్ని ఎత్తివేయకుండా అలాగే ఉంచింది. ఇరాన్ ఇటీవల ఈ శాంతి ఒప్పందం కారణంగా.. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినా.. అమెరికా మాత్రం నావల్ బ్లాకేడ్ కొనసాగించింది. ఇది ఇరాన్‌కి ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు.. ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా.. ఇరాన్‌ని తీసిపారేశారు ట్రంప్. అసలు తమ మధ్య శాంతి ఒప్పందమే కుదరలేదనీ, అది వట్టి డ్రాఫ్ట్ మాత్రమే ననీ.. ఇరాన్ ఏమాత్రం తోకజాడించినా.. తీవ్ర దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు.. మంటలు రేపాయి. ఇరాన్‌కి మంట పుట్టించాయి. ఫలితమే ఈ నిర్ణయం. ఇజ్రాయెల్ కూడా కారణమే. సరిహద్దుల్లో ఉన్న లెబనాన్‌లో ఉంటున్న హెజ్బుల్లా తీవ్ర వాదులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటం.. అలాగే.. లెబనాన్ సరిహద్దుల్లోని, లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ సైన్యం మోహరించడం వంటి అంశాలు ఇరాన్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమకు సపోర్టుగా ఉన్న హెజ్బొల్లాని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుండటం ఇరాన్‌కి అస్సలు నచ్చట్లేదు. ఇది దశాబ్దాలుగా ఉన్న వైరం. కాబట్టి.. ఈ మంట మండుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ తీరు కూడా ఇరాన్‌కి ఆగ్రహం తెప్పింది. ఓ దశలో ట్రంప్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా నెతన్యాహూ వెనక్కి తగ్గలేదు. దాంతో ఇరాన్ శాంతి ఒప్పందం నుంచి తప్పుకొని.. హార్ముజ్ జలసంధిని మూసేసింది హార్ముజ్ మూసేయడమంటే.. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు, గ్యాస్ సప్లై తగ్గిపోవడమే. ఈ కారణంగా మళ్లీ ప్రపంచ చమురు ధరలు పెరుగుతాయి. అలాగే భారత్‌కి చమురు సప్లై సరిగా ఉండదు. దీంతో దేశంలో డిమాండ్, సప్లై సమస్యలు తలెత్తుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగినా ఆశ్చర్యం అక్కర్లేదు. అలాగే ఈసారి ఇళ్లలో వాడే వంటగ్యాస్ ధరలు పెంచినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఏమైనా జరగొచ్చు. మనం అన్నింటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఆల్రెజీ చిల్లులు పడిన జేబులకు మరిన్ని చిల్లులు పడే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మన ఇళ్లలో గ్యాస్, బళ్లలో పెట్రోల్‌ని జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే మన ఖర్చులు మరింత పెరిగిపోగలవు. ఇరాన్, అమెరికా పోరు వల్ల మన ఇండియా చిక్కుల్లో పడుతోంది. మన తెలుగు వారంతా ఖర్చుల భారాన్ని మోస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి, పేద వారికి ఈ యుద్ధం ఒక శాపంలా మారింది. మనపై బాంబులు పడకపోయినా.. ఆర్థిక బాంబులు వరుసగా పడుతూనే ఉన్నాయి. నిత్యవసరాలు, అత్యవసరాల ధరలు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. సరిగ్గా శాంతి ఒప్పందం కుదిరే సమయంలో.. ట్రంప్ చెప్పిన మాటలు, కఠిన చేతలు.. కొంపముంచాయి. ఇక ఇప్పట్లో ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువే. మరి ట్రంప్ ఏం చేస్తారు? మళ్లీ దాడులు చేస్తారా? అనేది కూడా ప్రశ్నే. ఈ అంశాలన్ని ముందుంది సమస్యల కాలం అని హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్త పడటమే మనం చేయగలిగేది. ప్రతీ రూపాయినీ కాపాడుకుందాం