సింగపూర్ విద్యా విధానంలో ప్రతిభకు ప్రాధాన్యం

మంత్రి నారా లోకేశ్

సాక్షి డిజిటల్ న్యూస్: వెల్ నెస్ అంబాసిడర్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకం వల్ల అక్కడ కెపాసిటీ బిల్డింగ్ బాగుంది. సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ చేస్తున్నారు, స్కూలు స్థాయిలో వెల్ బీయింగ్ కమ్యూనిటీస్, నెలకోసారి నిర్వహించే కాంప్లెక్ట్ మీటింగ్, స్ట్రెస్ మేనేజ్ మెంట్ వర్క్ షాపుల నిర్వహణ, టీచర్ ఎచీవ్ మెంట్ సెలబ్రేషన్స్ వంటివి ఉపాధ్యాయులకు ప్రోత్సహకారంగా ఉన్నాయని సింగపూర్ వెళ్లిన టీచర్లు చెప్పుకొచ్చారు. సింగపూర్ లో అత్యంత విజ్ఞానవంతమైన, కఠినమైన క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం అమలులో ఉండటం వల్ల అక్కడ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్నారని సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులు మంత్రి లోకేష్‌కు తెలియజేశారు. సింగపూర్ టూర్ కు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. అక్కడ ఉపాధ్యాయులు వారానికోసారి నిర్వహించుకునే సమావేశంలో సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్, వారి మధ్య కోఆర్డినేషన్ బాగున్నాయని చెప్పారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ... విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుదలకే రాష్ట్రంలో మనం విలువల విద్యపై చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామని చెప్పారు. తాను విద్యనభ్యసించిన స్టాన్ ఫోర్డ్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇన్విజిలేటర్లు ఉండరు, ఆనర్ కోడ్ ఉంటుంది, స్వీయ క్రమశిక్షణ వల్ల ఎవరూ అక్కడ కాపీయింగ్ వంటివి చేయరని అన్నారు. తల్లికి చెప్పలేని పని చేయొద్దన్న చాగంటి గారి మాటలు తన మనసును హత్తుకున్నాయని చెప్పారు. భీమిలికి చెందిన హెచ్ఎం తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ... వెల్ నెస్ అంబాసిడర్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకం వల్ల అక్కడ కెపాసిటీ బిల్డింగ్ బాగుంది, సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ చేస్తున్నారు, స్కూలు స్థాయిలో వెల్ బీయింగ్ కమ్యూనిటీస్, నెలకోసారి నిర్వహించే కాంప్లెక్ట్ మీటింగ్, స్ట్రెస్ మేనేజ్ మెంట్ వర్క్ షాపుల నిర్వహణ, టీచర్ ఎచీవ్ మెంట్ సెలబ్రేషన్స్ వంటివి ఉపాధ్యాయులకు ప్రోత్సహకారంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిభ చూపితేనే హైస్కూలులో మంచిసీటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోగలరా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లాకు చెందిన హెడ్ మాస్టర్ మోటా పార్వతి మాట్లాడుతూ... సింగపూర్ లో ఫ్యూచర్ ఫోకస్ ఎడ్యుకేషన్ అమలులో ఉందని, విద్యార్థులు స్కూలు నుంచే బయటకు వెళ్లే సమయానికి ఏదో ఒక స్కిల్ తో వెళ్తున్నారని, దీనివల్ల చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి అక్కడ లేదన్నారు. గుంటూరుకు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గుమ్మడి షీలా మాధురి మాట్లాడుతూ... సింగపూర్ లో విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.