
సాక్షి డిజిటల్ న్యూస్ : రాజ్యసభలో 33 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంంది. 75 మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా వారిలో 26 మంది ఎంపీలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. వీరిలో 26 మంది నేరాలు రుజువైతే వారికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది అని తెలుస్తోంది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.రాజ్యసభ సభ్యుల ఆర్థిక, నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా నివేదిక విడుదల చేసింది. రాజ్యసభలో మొత్తం 233 మంది సభ్యులు ఉండగా 226 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితా విడుదల చేసినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్దల సభలో అత్యధిక సంపన్నులతో పాటు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని తెలియజేయడం కలకం రేపుతోంది. అదే రాజ్యసభలో 75 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. 36 మందిపై తీవ్ర నేరారోపణలు దేశవ్యాప్తంగా రాజ్యసభ సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల ఆస్తులతోపాటు నేరచరిత్ర, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం ఒక ఎంపీపై హత్య కేసు(సెక్షన్ 302), నలుగురు ఎంపీలపై హత్యాయత్నం(సెక్షన్ 307) కేసులు ఉన్నాయి. 226 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 75 (33 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని... 40 (18 శాతం) మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 36 మంది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు అని ఏడీఆర్ తాజా నివేదికలో పొందుపరిచింది. బీజేపీకి చెందిన 28 మందిపై క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుల్లో బీజేపీకి చెందిన వారే అత్యధికంగా కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన 107 మంది ఎంపీలలో 28 మందిపైనా, కాంగ్రెస్‌కు చెందిన 29 మందిలో 12 మందిపైబా క్రిమినల్ కేసులు ఉన్నాయి. టీఎంసీకి చెందిన 13 మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం)నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే ఆప్‌కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది కూడా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అలాగే వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకే 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.