మంత్రి జూపల్లికి హరీశ్ రావు రాజీనామా సవాల్

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్షారావు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లిలు వేర్వేరుగా ప్రకటనలు ఇవ్వడంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి’అని మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీమంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్తోంది అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన SIRపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాజీమంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని...ప్రభుత్వ పెద్దల మధ్యే లెక్కల్లో పొంతన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.మంత్రి జూపల్లి లెటర్ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలో సంగారెడ్డిలో పీపీటీ ద్వారా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు అప్పులపై ఇస్తున్న వివిధ వ్యాఖ్యలపై పీపీటీ రూపంలో వివరించారు. జూపల్లి సవాల్‌కు ఆధారాలతో సహా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వాట్సప్ లో ఆధారాలు పంపుతున్నా... చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి మాజీమంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుల మీద చర్చ అని నిన్న పారిపోయిండు ‘అప్పుల మీద చర్చ అని నిన్న పారిపోయిండు మంత్రి జూపల్లి కృష్ణారావు. నేను తెలంగాణ భవన్‌కు వచ్చి ఉంటే రానేలేదు. రాకుండా ముఖం చాటేసిండు’అని మండిపడ్డారు.‘తెలంగాణ భవన్‌కు వస్తానని తోక ముడిచిండు. మొన్న తెలంగాణ భవన్ అన్నడు, నిన్న గన్ పార్క్ అన్నడు, నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నడు. నిన్న గన్ పార్క్ కు వస్తా అంటే పోలీసులను పెట్టి అరెస్టు చేసిండు. పోలీసు స్టేషన్ లో పెట్టిండు. పోలీసు స్టేషన్‌కు రమ్మంటే రాలేదు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్. ఈరోజు ఉత్తం రాసిండు. వాట్సప్ పెట్టిండు.కేటీఆర్, హరీశ్ రావు రావాలన్నడు. మేం వస్తే కేసీఆర్ రావాలె అంటున్నడు’అని మాజీమంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయ్ ‘నేను చాలా సీనియర్. ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా కేసీఆర్ వస్తనే వస్తా అని తప్పించిండు.అంత సీనియర్ మంత్రి జూపల్లి నీ లేఖ చూస్తనే తెలుస్తున్నది’అంటూ మాజీమంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.‘కాంగ్రెస్ ప్రభుత్వ మొత్తం రెండున్నర ఏండ్లలో చేసిన అప్పు లక్షా 77వేల 58 కోట్లు అని లేఖలో రాసిండు. నిజానికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం జూన్ 30, 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు లక్షా 86వేల 67 కోట్లు. మార్చి 18, 2026 నాడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పిండు. మేం చేసిన అప్పు 3లక్షల 47వేల 294 కోట్లు అన్నరు. నెలకో లెక్క చెబుతాారా? ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి’అని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.