
సాక్షి డిజిటల్ న్యూస్: పీఎం కిసాన్ యోజన డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా... అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు మీకౌంట్లో పడినట్లు వార్తలు రాగానే వెంటనే చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం. పీఎం కిసాన్ యోజన 23 విడత డబ్బులు జూన్ 20వ తేదీ అంటే శనివారం విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది కోట్లకు మంది పైగా లబ్ధిదారులు 23వ విడత పిఎం కిసాన్ యోజన డబ్బులను అందుకోనున్నారు. పిఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం రెండో విడత ఈ సంవత్సరం రెండు వేల రూపాయలు లభించనున్నాయి. ఈ మొత్తం ఏడాది 6000 లభించనుండగా ఇప్పటికే మొదటి విడతగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా ఇప్పుడు మరో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం 6000 రూపాయలు జమ చేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద లభించినటువంటి ఈ డబ్బు రైతులకు రుణం రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి ఇది పూర్తిగా ఆర్థిక సహాయం రూపంలో మాత్రమే లభిస్తుంది. పిఎం కిసాన్ యోజన డబ్బులను రైతులు వ్యవసాయ ఖర్చులకోసం కానీ వ్యవసాయేతర ఖర్చులు కోసం కానీ ఖర్చు చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రవేశపెట్టగా పీఎం కిసాన్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ యోజన కింద అందిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం ఎవరైతే రైతులు పీఎం కిసాన్ యోజనలో నమోదు చేయించుకుంటారు వారికి మాత్రమే లభిస్తుంది. పిఎం కిసాన్ యోజన డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం రైతులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో మీ మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. దీంతోపాటు మీ పట్టాదారు పాసుబుక్కును సైతం పీఎం కిసాన్ యోజన దరఖాస్తు చేసే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన డబ్బులు పడగానే ఎలా చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ యోజన డబ్బులు ఎకౌంట్లో పడగానే మీ మొబైల్ ఫోనులో ఎస్ఎంఎస్ రూపంలో డబ్బులు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. పిఎం కిసాన్ యోజన డబ్బులు మీ అకౌంట్లో పడిన వెంటనే ఒకవేళ మీరు ఫోన్ లో మెసేజ్ చూడలేకపోతే, మీ సమీపంలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్లి పాసుబుక్ ఎంట్రీ చేయించి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద ఏటీఎం కార్డు ఉన్నట్లయితే ఏటీఎం సెంటర్ కు వెళ్లి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో బ్యాలెన్స్ ఎంక్వైరీ ద్వారా తెలుసుకోవచ్చు.