పాకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం

లోయలో పడడంతో 40 మంది మృతి

సాక్షి డిజిటల్ న్యూస్: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు హైవే నుంచి రాతి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు హైవే నుంచి రాతి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నైరుతి పాకిస్థాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలలో ఇది ఒకటని అధికారులు తెలిపారు. అధికారులు, మీడియా నివేదికల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బలూచిస్తాన్ ప్రావిన్సు రాజధాని క్వెట్టా నుంచి పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు పర్వత ప్రాంతమైన దానా సర్ లోని లోతైన లోయలోకి పడిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు పాడైపోవడంతో... అందులో ప్రయాణికులు కూడా ఇదే బస్సులో ఎక్కినట్టుగా తెలుస్తోంది. దీంతో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల సరిహద్దుకు సమీపంలో ఉన్న దానా సర్ అనే మారుమూల ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సు సుమారు 70 నుంచి 80 అడుగుల లోతులో పడిపోవడంతో చాలా మంది స్పాట్‌లోనే మరణించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీయడంతో పాటు, గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ... ఈ బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి కూడా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.