
జనం న్యూస్ : ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ సినిమాలు తీసుకోండి. ఏపీలో రాజకీయం చేసుకోండి. అంతేకానీ ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే కుదరదు’ అని కవిత హెచ్చరిచారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలే రాజకీయం చేయాలి కానీ పవన్ కల్యాణ్ వచ్చి రాజకీయం చేస్తామంటే కుదరదు.తెలంగాణతో పవన్ కల్యాణ్‌కు సంబంధం ఏమిటి?అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు.జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో ఏం పని అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సినిమాలు చూసి సంతోషిస్తాం కానీ రాజకీయం చేస్తామంటే సహించేది లేదు అని కవిత హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రాజకీయాలు చేసుకుంటూ... ఇక్కడ సినిమాలు తీసుకోండి. కానీ సినిమాల ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని కబ్జా చేస్తారు అని కవిత ధ్వజమెత్తారు. గతంలో మన భాషను వెక్కిరించి రాష్ట్రాన్ని కబ్జా చేశారు. పవన్ కల్యాణ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేద్దాం... అతను అన్‌ఫిట్ నాయకుడు అని టీఆర్ఎస్ చీఫ్ కవిత మండిపడ్డారు. మా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోం అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.
పవన్ కల్యాణ్‌కు తెలంగాణ రీజియన్‌కు సంబంధం లేదు
తెలంగాణ రాజకీయాలతో పవన్ కల్యాణ్‌కు సంబంధం లేదు అని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. ‘తెలంగాణ పవన్ కల్యాణ్ రావొచ్చు... పోవచ్చు. సినిమాలు తీసుకోవచ్చు. సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. మీ సినిమాలు చూసి మీరు వేసే స్టెప్పులు చూసి చప్పట్లు కొడతాం’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చెప్పుకొచ్చారు.‘మా నైజాంలో అన్నింటికన్నా పవన్ కల్యాణ్‌కు అత్యధిక కలెక్షన్లు వస్తుంది. సినీ పరిశ్రమ బతికేదే తెలంగాణ ప్రజల వల్ల.తెలంగాణ అభిమానుల వల్ల అని’ కవిత చెప్పుకొచ్చారు. ‘పవన్ కల్యాణ్ ఒక సినిమా యాక్టర్. మనకు ఒక ఎంటర్ టైన్ ఫ్యాక్టర్. అక్కడి వరకు ఒకే. యువత కేవలం పవన్ కల్యాణ్‌ను ఒక నటుడిగానే చూడాలి. ఆయనకు మన రీజియన్‌కు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రాంతంలో అధికారంలో ఉన్నాడు. ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి పవన్ కల్యాణ్’అని కవిత చెప్పుకొచ్చారు.
సినిమాలు తీసుకోండి కానీ రాజకీయం ఏపీలో చేసుకోండి
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 11 రోజులు బాధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు అన్నం తినడం మానేశాడు’అని ఆయన స్వయంగా ప్రకటించారు అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గుర్తు చేశారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఉంటారో అలా 11 రోజుల అన్నపానీయాలుమానేశాడు అని ధ్వజమెత్తారు. తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులు, యువతకు ఒక్కటే చెప్తున్నాం. పవన్ కల్యాణ్ ఇక్కడ సినిమాలు తీసుకోండి కానీ రాజకీయం మాత్రం ఏపీలో చేసుకోండి. అంతేకానీ ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే కుదరదు. తెలంగాణలో తెలంగాణ ప్రజలే రాజకీయం చేయాలి’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చెప్పుకొచ్చారు.
సెక్రటేరియట్ దిక్కు చూస్తే ఊరుకోం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎంతోమంది ఆత్మబలిదానాలతో ఏర్పడింది. 1200 మంది ఉద్యమకారులు బలయ్యారు. ఈ విషయాలను ప్రస్తుత తరం యువత తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరంతా చిన్న పిల్లలు కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సూచించారు. గతంలో సినిమా యాక్టర్ ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేశారు. తెలంగాణ యాష బాగోలేదు అని అన్నారు. యాస పేరుతో మమ్మల్ని ఏడిపించారు. తెలంగాణ యాసలో మాట్లాడకుండా చేశారు. నా ఊరు భువనగిరి...నా పేరు యాదగిరి...నేను చేసేది దాదాగిరి అంటూ డైలాగులతో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టారు.మేము తెలంగాణ యాస మాట్లాడేందుకు సైతం ఇబ్బంది పెట్టేవారు’అని కవిత గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ యాష ఫ్యాషన్ అయ్యింది. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు వాడే తెలంగాణ యాస ఇప్పుడు సినిమా హీరోలకు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ యాసే ట్రెండింగ్‌లో ఉంది అని కవిత చెప్పుకొచ్చారు.‘పవన్ కల్యాణ్ కేవలం ఒక ఎంటర్టైన్ ఫ్యాక్టర్. రండి సినిమాలు చేసుకోండి. మేకప్‌లు చెప్పుకోండి..ప్యాకప్‌లు చెప్పుకోండి కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకోం’అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.