తెలంగాణ జలాల అంశంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ఘాటు లేఖ

సాక్షి డిజిటల్ న్యూస్: ‘తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం ప్రభుత్వ చట్టబద్దమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హక్కులను కాపాడటం కోసం బిఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుంది. ఎంత దూరం దాకా అయినా వెళ్లి కొట్లాడుతుంది’అని హరీశ్ రావు హెచ్చరించారు. తెలం‘సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం’అని మాజీమంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరవును పారద్రోలి, పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసింది’అని మాజీమంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు. ప్రమాదంలో పాలమూరు రైతాంగం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది అని మాజీమంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖలో ఆరోపించారు. ‘నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తున్న మీరు, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో వ్యవహరిస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.‘పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసం? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి NOC తెస్తున్నాం అనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా? తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 TMC), చిక్కాలపర్వి(2.5 TMC), చిక్కాలమంచి (5 TMC) బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?’అని మాజీమంత్రి హరీశ్ రావు లేఖలో నిలదీశారు.గాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఘాటు లేఖ ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం మీకు తెలియదా? లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా?’అని మాజీమంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.‘రాయచూర్ జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకాన్ని రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్టేక్ నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయితే మీరు, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా? ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు?. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? దీని వెనుక ఉన్న లోపాయికార ఒప్పందాలు ఏమిటి?’అని మాజీమంత్రి హరీశ్ రావు లేఖలో ఆరోపించారు. కర్ణాటక అదనపు నీటిని వినియోగిస్తోంది ‘ఇప్పటికే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగా అందని పరిస్థితి ఉంది. కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోంది.ఆర్డీఎస్ లో కర్ణాటక వాటా 1.2 టి ఎం సి మాత్రమే. కాని సగటున 5 టిఎంసిల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన అక్రమంగా కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్ మరియు చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుంది. ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.