సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నయి. తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూ. 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రూ. 36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రూ. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియాల్లో బాల బాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేసిన పనుల వివరాలు... రూ. 10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం. రూ. 10 కోట్లతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ. రూ. 4 కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం రూ. 4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో మల్టీపర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖో- ఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి. రూ. 3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం. రూ. 2.65 కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం రూ. 2.50 కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణం. ప్రారంభోత్సవాల వివరాలు... రూ. 5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ. రూ. 35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ. రూ. 44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ. రూ. 58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ అకాడమీ. రూ. 49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీ.