తుంగభద్ర జలాల వినియోగంపై రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన

★ తుంగభద్ర నుంచి 15.9 టీఎంసీల నీటి వినియోగానికి చర్యలు అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ : ఆర్డీఎస్ కింద పాలమూరుకు కేటాయించిన 15.9 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించగలుగుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యల కారణంగా కేటాయించిన నీటిలో మరో 10 టీఎంసీల నీరు అందక, గద్వాల్, అలంపూర్ ప్రాంతాల్లో ఆర్డీఎస్ కింద ఉన్న లక్షలాది మంది రైతులకు నష్టం జరుగుతుంది అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో 'రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌'లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని, మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు. కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు. వీరితోపాటు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

5 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నాం

ఆర్డీఎస్ కింద పాలమూరుకు కేటాయించిన 15.9 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించగలుగుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యల కారణంగా కేటాయించిన నీటిలో మరో 10 టీఎంసీల నీరు అందక, గద్వాల్, అలంపూర్ ప్రాంతాల్లో ఆర్డీఎస్ కింద ఉన్న లక్షలాది మంది రైతులకు నష్టం జరుగుతుంది అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు సీఆర్ పాటిల్, చంద్రబాబు, నేను.. 3 రాష్ట్రాల ప్రతినిధులం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, దానికి బళ్లారి వేదికగా తుంగభద్ర నది ఒడ్డున సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే పట్టుదలతో ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి అని చెప్పుకొచ్చారు.కేంద్ర జలశక్తిమంత్రి సీఆర్ పాటిల్ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

నీరు వృథాగా సముద్రంలోకి పోతుంది

‘మూడు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ శాశ్వతంగా పరిష్కరిస్తారని నమ్ముతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమస్యను పాటిల్ , చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాను. నీటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల పొలాలను తడపాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఈ సమస్య ఇప్పటిది కాదు. మూడు తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతున్నది. బళ్లారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లాల లక్షలాది మంది రైతుల సమస్యలకు ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతున్నది’అని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతన్నల కోసం ముఖ్యమంత్రులం ముందడుగు వేశాం

‘రాజకీయాలకు అతీతంగా, తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం కృష్ణా, గోదావరి, తుంగభద్ర జలాల్లో అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం’అని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతుల కోసం మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం నవాబు కలిసి తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం గొప్ప పని చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా రైతన్నల కోసం అడుగులు ముందుకు వేశాం. మూడు రాష్ట్రాల సమస్యలన్నింటిని పాటిల్‌కి విన్నవించాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

20వ గేటును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అంతకుముందు కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా...మీట నొక్కి 17వ గేటును సీఆర్ పాటిల్ ప్రారంభించగా... 18వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు మరియు తాగునీటి అవసరాల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలవనుంది.