‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు మంత్రి లోకేష్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు గుడ్ న్యూస్... రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తల్లికి వందనం నిధుల విడుదల తేదీలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు గుడ్ న్యూస్... రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తల్లికి వందనం నిధుల విడుదల తేదీలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే రేణిగుంట సమీపంలో జరిగిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే తమ కుటుంబానికి ప్రత్యేక ప్రేమ అని చెప్పారు. స్టూడెంట్ లీడర్‌గా ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేల చిత్తూరు జిల్లా అని పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్‌కు కూడా ఉమ్మడి చిత్తూరుపై ప్రేమ ఉండేదని తెలిపారు. మహిళలకు ఉన్నత విద్య అందించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన క్యార్తకర్తలకు న్యాయమ చేసే బాధ్యత తనదని లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం అని... కోటిమందికి పైగా సభ్యులు ఉన్న వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయని, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోవాలని కోరారు. కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 15వ తేదీ నుంచి డోర్ టూ డోర్ ప్రచారం ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు... కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది, అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ నెల 16,17,18 తేదీల్లో మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) నిర్వహించే సమయంలోనే తల్లికి వందనం రెండో విడత (ఈ ఏడాది)డబ్బులను కూడా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని లోకేష్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమం అందించడంతో పాటు… పెద్ద ఎత్తున అభివృద్ది పనులు కూడా చేపడుతుందని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ప్రవాహంలా వస్తున్నాయని అన్నారు. తన యువగళం పాదయాత్రలో మెగా డీఎస్సీ హామీ ఇచ్చానని… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. 6 వేల కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది 10 వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటించామని గుర్తుచేశారు. ఆగిపోయిన అమరావతి, పోలవరం పనులను పరుగెత్తిస్తున్నామని తెలిపారు. కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒకటి నుంచి పన్నెండో తరగతి విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం రూ. 15 వేలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు జమ చేసి, మిగిలిన రూ. 2 వేలు పాఠశాలల మెయింటనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఒక్కో విద్యార్థి తల్లికి రూ. 13 వేల చొప్పున సాయం బ్యాంకు ఖాతాల్లో వేస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 26 వేలు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 39 వేలు… నలుగురు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 52 వేలు.. ఇలా అందిస్తుంది.