
అక్షర ఆయుధం ; తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా మహిళలే అని తెలుస్తోంది. ఇదే ప్రమాదంలో 70 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రమాదాల్లో ప్రతీ ఏడాది వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలే అని తెలుస్తోంది. మరోవైపు 70 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అమోనియా గ్యాస్ లీక్ ఘటనలో ఏడుగురు మృతి తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని కన్నిగైపెట్టై గ్రామంలో రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వందకు మందికి పైగా కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అయితే ఆదివారం ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి ఊపిరాడక కుప్పకూలిపోయారు. వీరిలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా మహిళలే అని తెలుస్తోంది. అలాగే 70 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్సకోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్లపై ఉన్నారని మరికొందరు ఇంట్యుబేషన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.మృతుల్లో అత్యధికమంది వలస కార్మికులే ఇదిలా ఉంటే మృతుల్లో అత్యధిక మంది వలస వచ్చిన వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తేలింది. అంతేకాదు మృతుల్లో చాలా మంది 24-25 ఏళ్ల వయసున్న యువతులే అని తేలింది.ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని వేల్స్, వెంకటేశ్వర ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగింది ఇలా! కోల్డ్ స్టోరేజ్ యూనిట్లోని వాల్వ్ ఫెయిల్ కావడం వల్లే గ్యాస్ లీక్ అయినట్లు నిపుణులు, కంపెనీ సిబ్బంది చెప్తోంది. వాల్వ్ లీక్ కావడంతో అమోనియం గ్యాస్ లీకై క్షణాల్లో వ్యాపించిందని దీంతో కొందరు అది పీల్చి చనిపోయినట్లు తెలిపారు. కొందరు కంపెనీ నుంచి పరుగెత్తి ప్రాణాలు రక్షించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకుకున్న తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత ఘటనా స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై, కంపెనీలో భద్రతా లోపాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ కవిత వెల్లడించారు.