చైనీస్ BAT BMS యాప్‌పై కేంద్రం కొరడా..

★వెంటనే తొలగించాలని ఆదేశం

జనం న్యూ స్ : BAT BMS యాప్‌ను తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చైనాకు చెందిన కంపెనీ రూపొందించిన ‘‘BAT BMS’’ కేంద్రం నిషేధించింది. BAT BMS యాప్‌ను తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కేంద్ర ఆదేశాలతో... BAT BMS యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లు తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... BAT BMS యాప్‌ ద్వారా ఈ-రిక్షాలను దూరం నుంచే రిమోట్ ద్వారా నిలిపివేసే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లో ఫీచర్స్ దుర్వినియోగమైతే వాహన దారులకు, ప్రయాణికులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ ఈ వ్యవహారంపై స్పందించారు. పంకజ్ సింగ్ గురువారం రోజున మాట్లాడుతూ... సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ జరుపుతోందని చెప్పారు. వాహనాలను ఇలా రిమోట్‌గా నియంత్రించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఈ ఆరోపణలపై పోలీసులు చర్య తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026 కింద ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా BAT BMS యాప్‌ను తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌‌ల నుంచి తొలగించారు. BAT BMS యాప్ గురించి... BAT BMS యాప్‌ను చైనాకు కంపెనీ షెన్‌జెన్ గ్రెనర్జీ టెక్నాలజీ డెవలప్‌ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లిస్టింగ్ ప్రకారం...BAT BMS యాప్ లిథియం-అయాన్ బ్యాటరీల పనితీరును పర్యవేక్షించడం కోసం రూపొందించబడింది. అంతేగానీ, వాహనాలకు ఎలాంటి అంతరాయం కలిగించే ఉద్దేశంతో దీనిని రూపొందించలేదు. బ్యాటరీ ప్యాక్‌ను తెరవకుండానే బ్యాటరీ పనితీరును పర్యవేక్షించడానికి ఈ యాప్‌ వీలు కల్పిస్తోంది. ఇది బ్యాటరీల ఛార్జ్ స్థాయి, వోల్టేజ్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సైకిల్స్, బ్యాటరీ సామర్థ్యం వంటి వివరాలను చెక్ చేయడంలో వినియోగదారులను సహాయపడుతుంది. ఈ యాప్ బ్లూటూత్ 5.0 ఉపయోగించి బ్యాటరీకి కనెక్ట్ అవుతుంది. సుమారు 15 మీటర్ల పరిధి వరకు ఇది పనిచేస్తుంది. ఒక సమయంలో ఒక ఫోన్... ఒక బ్యాటరీకి మాత్రమే కనెక్ట్ కాగలదు. ప్రధానంగా ఈ-రిక్షా యజమానులు, టెక్నీషియన్ల కోసం ఈ యాప్‌ను డెవలప్‌ చేశారు. అయితే సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోతే ఈ యాప్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.