
జనం న్యూస్ : గండిపేటలో ప్రభుత్వ భూమి కబ్జా, ఫేక్ జీవో కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. బొల్లా బ్రహ్మనాయుడుకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. 15 రోజులకు ఒకసారి పీఎస్‌కు హాజరుకావాలని... రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కండీషన్లు పెట్టింది. హైదరాబాద్ శివారు గండిపేటలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా, ఫేక్ జీవో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బిగ్ రిలీఫ్ దక్కింది.రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు మూడు రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరించారు. ఈ సందర్భంగా విచారణలో బ్రహ్మనాయుడు తమకు సహకరించలేదు అని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. కస్టడీలో ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు అని కోర్టుకు వివరించారు. దర్యాప్తునకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బొల్లా బ్రహ్మనాయుడికి ఊరట రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఊరట లభించింది. గండిపేటలో ప్రభుత్వ భూమి కబ్జా, ఫేక్ జీవో కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అదే సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్ పిటిషన్‌పైతం విచారణకు వచ్చింది.బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే పోలీసుల తరఫు న్యాయవాది మాత్రం బ్రహ్మనాయుడు విచారణకు ఏమాత్రం సహకరించలేదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో దర్యాప్తునకు ఆశించిన స్థాయిలో బ్రహ్మనాయుడు సహకరించలేదు అని కోర్టులో వాదించారు. అయితే కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్ పొందేందుకు అర్హుమడేనని న్యాయవాది వాదనలు వినిపించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బొల్లా బ్రహ్మ నాయుడికి బెయిల్ మంజూరు చేసింది. కండీషన్స్ అప్లై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. రూ. 20 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి 15 రోజులకు ఒకసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను లేదా సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టమైన కండీషన్స్ విధించింది.