కేంద్ర మంత్రులతో రేవంత్ చర్చలు హైదరాబాద్ మెట్రోకు ఊతం?

సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం పూర్తి చేయడం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి చర్చలు… హైదరాబాద్ మెట్రో విస్తరణకు లైన్ క్లియర్? హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం పూర్తి చేయడం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు అయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఆ వివరాలు... ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తొలుత సోమవారం రోజున కేంద్ర మంత్రలు అశ్విని వైష్ణవ్‌, కిషన్ రెడ్డిలతో చర్చలు జరిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రూ. 13,600 కోట్ల రుణాన్ని ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విడుదల చేసేలా చూడాలని కోరారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం చర్చలు సానుకూలంగా సాగినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశం కానున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున కేంద్ర మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో కూడా ముగ్గురు కేంద్ర మంత్రులతో హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే ఈ చర్చలు సానుకూలంగా సాగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయని పేర్కొంది.. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ‌రుస‌గా రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో చర్చలు విజయవంతమయ్యాయని తెలిపింది. ఈ చర్చల సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- 1 వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌ 2 విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి వ‌చ్చారని తెలిపింది.క‌న్స‌ల్టెంట్‌గా SBICAPS ని ఎంపిక చేశారని... ఇది మెట్రో ఫేజ్‌ 1వాల్యూయేష‌న్‌, ఫేజ్‌2 విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుందని పేర్కొంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారని వెల్లడించింది. క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వ‌యానికి ప్ర‌తినిధులుగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారని తెలిపింది. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్ర‌క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారని పేర్కొంది.