అక్షర ఆయుధం : జాతీయ ఉపాధి హామీ పథక స్థానంలో అమలు చేస్తున్న వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నిధులతో ఆయా పంచాయతీల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లు వెచ్చించనున్నామని...ఈ నిధులతో ఆయా పంచాయతీల్లో రోడ్డు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంలో రూ.6.45 కోట్లతో దేవాలయాల మరమ్మతులు, నూతన దేవాలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.8 కోట్లతో టీటీడీ నిధులతో పెనుకొండలో కల్యాణమండపం నిర్మాణంతో పాటు నియోజక వర్గంలో 12 భజన మండళ్లు, దేవాలయాలకు మైక్ సెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో రూ.కోటీ 97 లక్షలతో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం మంత్రి సవిత భూమి పూజ చేశారు. అనంతరం అదేవిధంగా గ్రామంలో రూ. 70 లక్షలతో పూర్తి చేసిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, నియోజక వర్గంలో దేవాలయాల మరమ్మతులు, నూతన దేవాలయాల నిర్మాణానికి దేవాదాయ శాఖ, టీటీడీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాయన్నారు. సీజేఎఫ్ నిధుల ద్వారా రూ.1.97 కోట్లతో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. పెనుకొండ నియోజక వర్గంలో రూ.6.45 కోట్లతో పలు దేవాలయాలకు మరమ్మతులు చేయడంతో పాటు నూతన దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీ రూ.8 కోట్లు కేటాయించిందని, ఈ నిధుల్లో రూ.5 కోట్లతో పెనుకొండలో కల్యాణమండపం నిర్మిస్తున్నామని తెలిపారు. మరో రూ.3 కోట్లతో 12 భజన మండళ్లు, దేవాలయాలకు మైక్ సెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి పంచాయతీకీ రూ.2 కోట్లుజాతీయ ఉపాధి హామీ పథక స్థానంలో అమలు చేస్తున్న వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నిధులతో ఆయా పంచాయతీల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నూతన వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా 125 పని దినాలు కల్పిస్తున్నామని, రోజుకు రూ.312లను కూలిగా ఇవ్వనున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిపై చర్చకు రెడీ...గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి, సంక్షేమం రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టినట్లు మంత్రి సవిత వివరించారు. గోరంట్ల మండలంలోనే సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.93 లక్షలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.70 లక్షలు వెచ్చించామన్నారు. రూ.5 కోట్లతో ఓనవోలు - కొలింపల్లి బీటీ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. నెల రోజుల్లో ఓనవోలు - గుంటుపల్లి రోడ్డును పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఇవే కాక మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రెండేళ్ల కూటమి పాలనపైనా, 5 ఏళ్ల వైసీపీ పాలనపైనా చర్చకు సిద్ధమని మంత్రి సవిత సవాల్ విసిరారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం(సర్) పై ఎవరూ నిర్లక్ష్యం చూపొద్దని, బీఎల్వోలు అడిగిన సమాచారం అందజేయాలని, లేకుంటే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరూ ఎన్నికల అధికారులకు కలిసి తమ సమాచారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు, కార్యకర్తలు, దేవాదాయ శాఖాధికారులు పాల్గొన్నారు. జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు...సీఎం చంద్రబాబునాయుడు సమర్త నాయకత్వంలో రైజింగ్ రాయలసీమ ఆవిర్భవిస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటవుతోందని, ఈ పరిశ్రమతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ఇప్పటికే రాయలసీమను డ్రోన్ హబ్ గా, పారిశ్రామిక హబ్, టూరిజం హబ్ గా, హార్టీకల్చర్ హబ్ గా రూపొందించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యుద్ధ విమానాలు, రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమలు ఏర్పాట య్యాయన్నారు. రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తమ ఘనతేనని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 2018లోనే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారన్నారు. జగన్ క్రెడిడ్ అంతా రప్పా రప్పా నరకడం, విధ్వంసమేనన్నారు. తమ ప్రభుత్వానిది అభివృద్ది క్రెడిట్ అన్నారు. జగన్ రప్పా రప్పా క్రెడిట్ తమకు అవసరం లేదన్నారు. అమరావతికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళతామంటున్న జగన్ ను 2024 ఎన్నికల్లోనే ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.