
అక్షర ఆయుధం : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియల్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను http://resultsbie.ap.gov.in వెబ్సైట్లో లేదా మనమిత్ర వాట్సాప్ నెం. 9552300009 ద్వారా చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు సాధించని విద్యార్థులు వారి ఫలితాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా... 1.83 లక్షలకు పైగా విద్యార్థులు తమ పర్ఫామెన్స్ మెరుగు పరుచుకున్నారు. అదే సమయంలో, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని కొనసాగించడానికి మరో అవకాశాన్ని పొందారు.విజయవంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ... పట్టుదల, కృషి ద్వారా తమ పనితీరును మెరుగుపరుచుకున్న వారికి అభినందనలు చెబుతున్నానని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థుల పట్టుదల నిజంగా ప్రశంసనీయం, వారి విద్యా ప్రయాణంలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన 2,29,034 మంది అభ్యర్థులలో 1,35,435 మంది విద్యార్థులు (59 శాతం) తమ పర్ఫామెన్స్ మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ఇక, 1,09,003 మంది అభ్యర్థులలో 42,379 మంది విద్యార్థులు (39 శాతం) ఉత్తీర్ణులై తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారని చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంకు సంబంధించి 91,303 మంది అభ్యర్థులలో 48,149 మంది విద్యార్థులు (53 శాతం) తమ పర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇక, 1,02,018 మంది అభ్యర్థులలో 57,327 మంది విద్యార్థులు (56 శాతం) ఉత్తీర్ణులై తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ఇక, ఉన్నత విద్య, ఉజ్వల అవకాశాల వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ https://resultsbie.ap.gov.inను సందర్శించాలి. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ జనరల్ / ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ / సెకండ్ ఇయర్ జనరల్ /సెకండ్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.>> ఆ తర్వాత విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, తదితర వివరాలు ఎంటర్ చేయాలి.>> అప్పుడు ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఈ ఫలితాలను డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.ఇక, ఇంటర్ ఫలితాల కోసం వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు Hai అని మెసేజ్ పెట్టాలి. అక్కడ సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్చన్‌ను ఎంచుకోవాలి. అనంతరం డౌన్లోడ్ ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు 2026ను ఎంచుకోవాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మార్క్‌లు చెక్ చేసుకోవచ్చు.ఇదిలాఉంటే, ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు 2026ను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గత 12 ఏళ్లలో ఇంటర్ ఫలితాల్లో ఈసారి అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం ఉత్తీర్ణత, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది.అయితే ఆ తర్వాత ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు, మార్కులు మెరుగుపరుచుకునే విద్యార్థులుకు ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం కల్పించారు. అయితే గతంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం ఉండేంది. అయితే ఈ ఏడాది తొలిసారిగా ఇంటర్ సెకండియర్ విద్యార్థలకు కూడా ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశం కల్పించారు.