
అక్షర ఆయుధం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తులో ఏమైన తప్పిదాలు ఉంటే సరి చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక్కసారి డిలీట్ ఆప్షన్ సౌకర్యం కల్పించినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. వన్ టైం డిలీట్ ఐచ్చిక సౌకర్యాన్ని ఉపయోగించుకొని సరైన వివరాలతో దరఖాస్తు పూరించి, తిరిగి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్ష విధానంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టెట్ దరఖాస్తునకు వన్ టైం డిలీట్ సదుపాయం కల్పించింది. 'వన్ టైం డిలీట్ ఐచ్చిక సౌకర్యాన్ని ఉపయోగించుకొని సరైన వివరాలతో దరఖాస్తు పూరించి, తిరిగి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాం.అయితే ఈ సౌకర్యం జూలై 2 నుంచి 5వ తేదీ వరకు అందుబాటులోకి ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 5వ తేదీ చివరితేదీగా పేర్కొంది.ఇకపోతే వనైం డిలీట్ ఐచ్చికంలో ఆధార్ నంబరు, ఫోన్ నంబరు మినహా మిగతా అన్ని అంశాలను సరి చేసుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం పేర్కొంది. జూలై 5 చివరి తేదీటెట్ దరఖాస్తునకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీ 5 జూలై 2026గా ప్రభుత్వం పేర్కొంది.అయితే చాలా మంది అభ్యర్థులు అప్లికేషన్ పూరించే సమయంలో పేరు, విద్యార్హతలు, పుట్టిన తేదీ లేదా ఫోటో, సంతకం వంటి వివరాలను తప్పుగా నమోదు చేశామని, వాటిని మార్చుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ వన్-టైమ్ డిలీట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమ పాత (తప్పులున్న) దరఖాస్తును డిలీట్ చేసి, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా మళ్లీ కొత్తగా సరైన వివరాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అని టెట్ కన్వీనర్ వెంకట కృష్షారెడ్డి పేర్కొన్నారు.అయితే ఈ అవకాశం కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే లభిస్తుందని కాబట్టి ఈసారి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వివరాలను పరిశీలించుకుని అప్లై చేయాలని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. టెట్ జూన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5 చివరి తేదీ. కాబట్టి చివరి మూడు రోజులు సర్వర్ డౌన్ లేదా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించి.....ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించవచ్చు అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టెట్ పరీక్ష అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారింది. టెట్ దరఖాస్తునకు చివరి తేదీ జూలై 5 కాగా పరీక్ష తేదీలను సైతం టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే టెట్ పరీక్షలు 05-08-2026 నుంచి 21-08-2026 వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు …మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఉంటాయి. 25-07-2026 నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ 24-08-2026న విడుదల అవుతుంది. 25-08-2026 నుంచి 31-08-2026 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ 08-09-2026 విడుదల అవుతుంది. ఫలితాలను 15-09-2026 విడుదల చేయనున్నారు.