ఉండవల్లిలో టెన్షన్ టెన్షన్

అక్షర ఆయుధం : ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. వారిని ఉండవల్లిలో టీడీపీ శ్రేణులు, అమరావతి రైతులు అడ్డుకున్నారు. అంతేకాదు కోడిగుడ్లు, రాళ్లతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వైసీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అమరావతి రాజధాని భూముల పరిశీలన...రాజధాని పనులను పరిశీలించేందుకు వైసీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ తాడేపల్లి నుంచి బయలుదేరింది. అయితే వైసీపీ బృందం ఉండవల్లి వెళ్లేసరికి రైతులు, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు, ఉండవల్లి గ్రామస్థులు, అమరావతి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు వైసీపీ నేతల కారులపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి టీడీపీ, అమరావతి రైతులు నినాదాలు చేశారు .వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ బృందం పర్యటనను టీడీపీ అడ్డుకుంది. టీడీపీ శ్రేణులతోపాటు అమరావతి రైతులు వైసీపీ బృందాన్ని అడ్డుకున్నాయి. గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి అని వైసీపీ అంగీకరించిన తర్వాతే లోపలికి రావాలని కోరారు. రాజధానిని అంగీకరించని వైసీపీ తమ ప్రాంతాలలో పర్యటించే హక్కు లేదు అని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, అమరావతి మహిళా రైతులు, రైతులు నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ అధికారికి అస్వస్థత మరోవైపు ఉండవల్లివైపు వైసీపీ శ్రేణులు దూసుకొస్తుండగా టీడీపీ శ్రేణులు, అమరావతి రైతులు అడ్డుకున్నారు. వైసీపీ కార్లను ధ్వంసం చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు.పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై నిరసన కారులు ధ్వంసం చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారుపైనా టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. , పేర్ని నాని కారు ధ్వంసం. అంబటి రాంబాబుు చర్చకు రావాలంటూ నినాదాలు., ఇరు వర్గాల మధ్యతోపులాట. రాజధాని భూములను పరిశీలించే అధికారం వైసీపీకి లేదుఅని నిరసన కారులు ధ్వజమెత్తారు. ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దుతున్న తరుణంలో ఓ పోలీస్ అధికారి అస్వస్థతకు గురయ్యారు. కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. రాజధానిగా అమరావతిని అంగీకరించిన తర్వాతే వైసీపీ నేతలు అమరావతికి రావాలి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారుపై రాళ్ల దాడి.